ప్రమోషన్లు మొదలుపెట్టిన నాగార్జున !

nagarjuna
పరిశ్రమలోని సీనియర్ హీరోల్లో ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ట్రెండ్ మార్చి కథాపరమైన చిత్రాలకు ప్రాధాన్యమిస్తున్న నటుడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఈయన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశాయ’ అనే భక్తిరస చిత్రం చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అన్నమయ్య, శ్రీ రామదాసు, షిర్డీ సాయి’ చిత్రాలు భారీ విజయాల్ని సొంత చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై కూడ మంచి అంచనాలున్నాయి. పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్స్, పాటలు కూడా శ్రోతలను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతుండటంతో హీరో నాగార్జున పరమోషన్ల జోరు పెంచారు. చిత్రంలోని వేంకటేశ్వరస్వామి పాత్రధారి సౌరభ్ రాజ్ జైన్ తో కలిసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెనకటేశ్వరస్వామి భక్తుడు హాథిరామ్ బాబా జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందివ్వగా అనుష్క, విమలా రామన్, ప్రగ్యా జైస్వాల్ లు పలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

 

Like us on Facebook