నవంబర్ 15 నుండి ‘సోగ్గాడే చిన్నినాయనా’ షూటింగ్.

నవంబర్ 15 నుండి ‘సోగ్గాడే చిన్నినాయనా’ షూటింగ్.

Published on Oct 30, 2014 8:16 PM IST

nagarjuna
‘మనం’ వంటి సూపర్ హిట్ తర్వాత కింగ్ నాగార్జున నటించబోయే కొత్త సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ షూటింగ్ నవంబర్ 15 నుండి రాజముండ్రిలో ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘హలో బ్రదర్’ తరహాలో వినోదాత్మకంగా సినిమా ఉంటుందని సమాచారం. ఎందరో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చిన నాగార్జున, ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నారు.

రమ్యకృష్ణ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరొక హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది. ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తుండడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తారు. ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు