కృష్ణ వంశీ చేసింది అభిమానులకు కూడా నచ్చలేదు !


దర్శకులుగా తమకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న వారిలో కృష్ణ వంశీ కూడా ఒకరు. ఒకప్పుడు గుర్తుండిపోయే సినిమాలెన్నింటినో ప్రేక్షకులకందించిన ఆయన గత కొన్నాళ్లుగా పరాజయాల్లో ఉన్నారు. ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో ఫ్లాప్ అందుకున్న ఆయన చాలా గ్యాప్ తీసుకుని ‘నక్షత్రం’ సినిమా తీశారు. సాధారణ ప్రేక్షకులు ఎలా ఉన్నా ఈ సినిమాతో కృష్ణ వంశీ తప్పక మెప్పిస్తాడని ఆయన అభిమానులు ఆశించారు.

కానీ ఈసారి కూడా వాళ్ళ ఆశలు గల్లంతయ్యాయి. పేలవమైన స్క్రీన్ ప్లే, టేకింగ్ వలన ప్రేక్షకులతో పాటు వాళ్ళు కూడా సినిమా పట్ల తీవ్ర నిరుత్సాహాన్ని గురయ్యారు. అంతమంది పాపులర్ నటీనటులున్నా కూడా థియేటర్లలో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మరి వచ్చే సారైనా కృష్ణ వంశీ ప్రేక్షకులు మెచ్చే సినిమా తీస్తారేమో చూడాలి.

 

Like us on Facebook