అప్పుడే మరో సినిమా మొదలుపెట్టేస్తోన్న నాని!

అప్పుడే మరో సినిమా మొదలుపెట్టేస్తోన్న నాని!

Published on Dec 6, 2016 6:25 PM IST

nani2
న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు బ్రేక్ అన్నదే ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఇప్పటికే ఏడాదిన్నరలో ఐదు హిట్లు కొట్టి, ప్రస్తుతం ‘నేను లోకల్’ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తూనే, మరో కొత్త సినిమాను మొదలుపెట్టేందుకు రెడీ అయిపోయారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని రేపు సెట్స్‌పైకి వెళ్ళనుంది. హైద్రాబాద్‌లో రేపట్నుంచి మొదలయ్యే ఈ షెడ్యూల్ కొద్దిరోజుల పాటు ఇక్కడే కొనసాగుతుందట.

శివ నిర్వాన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈమధ్యే వైభవంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. హీరో ఆది పినిశెట్టి మరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో నివేథా థామస్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాని స్టైల్ కామెడీ అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు