శృతి హాసన్ స్థానాన్ని భర్తీ చేస్తాన్నంటున్న హీరోయిన్ !

శృతి హాసన్ స్థానాన్ని భర్తీ చేస్తాన్నంటున్న హీరోయిన్ !

Published on May 30, 2017 5:27 PM IST


దర్శకుడు సుందర్.సి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించ తలపెట్టిన ‘సంఘమిత్ర’ చిత్రానికి ఎవరు ఊహించని అడ్డంకి వచ్చి పడిన సంగతి తెలిసిందే. నిర్మాణ సంస్థ శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ ఎలాంటి ముందస్తు గమనిక లేకుండానే నిన్న సాయంత్రం ముందు నుండి అనుకుంటున్న శృతి హాసన్ ఈ సినిమా నుండి తప్పుకున్నారని ప్రటించేసింది. దీంతో అందరిలోను అయితే ఆ పాత్రను ఎవరు చేస్తారు అనే ప్రశ్న మొదలైంది.

ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం నటి నీతూ చంద్ర శృతి స్థానాన్ని భర్తీ చేస్తానంటూ ముందుకిచ్చింది. ఒక మార్షల్ ఆర్టిస్ట్ గా, థియేటర్ ఆర్టిస్ట్ గా అంకిత భావంతో, నిబద్దతతో, ఇష్టంతో ఆ పాత్రను చేస్తానని చెప్పుకొచ్చింది. మరి నీతూ చంద్ర స్టేట్మెంట్ ను సుందర్ సి ఎలా తీసుకుంటారో, చివరికి ఎవర్ని సెలెక్ట్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు