స్టార్ హీరోలకి సైతం ధైర్యం చెప్పిన నిఖిల్ !
Published on Nov 26, 2016 12:39 pm IST

nikhil-dhruva

ప్రస్తుతం పరిశ్రమలో గట్టిగా వినిపిస్తున్న ఒకే ఒక హీరో పేరు నిఖిల్. పెద్ద నోట్ల రద్దు కారణంగా కరెన్సీ కొరత ఏర్పడి అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమ సైతం ఇబ్బంది పడుతూ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ కలెక్షన్లు రావేమోనని భయపడి వెనక్కు తగ్గి సినిమాల్ని వాయిదా వేసుకుని కొందరు, వేసుకోవాలన్న ఆలోచనలో కొందరు ఉండగా నిఖిల్ మాత్రం ధైర్యం చేసి ఎటువంటి కథను నమ్ముకుని తన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాను రిలీజ్ చేసి ఏమాత్రం తడబడకుండా మొదటోరోజు నుండే ఖచ్చితమైన విజయాన్ని అందుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సినిమా హవా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.

నిఖిల్ సాధించిన ఆ అపూర్వ విజయాన్ని చూసిన చాలా మంది కథలో బలముంటే దేనికీ బయపడనక్కర్లేదని తెలుసుకుని ధైర్యం చేసి సినిమాలకు పక్క రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నారు. అలాంటి చిత్రాల్లో రామ్ చరణ్ ‘ధృవ’కూడా ఒకటి. మొదట డిసెంబర్ 2న రిలీజ్ చేయాలనుకున్నా కరెన్సీ కష్టాలు వలన అది క్యాన్సిల్ అయింది. ఆ తరువాత ఈ చిత్రం నేరుగా జనవరికే రిలీజ్ అని అన్నారు. కానీ నిర్మాత అల్లు అరవింద్ మాత్రం సినిమాని డిసెంబర్ 9కి ఫిక్స్ చేసి నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ ఇబ్బందుల వలనే కాస్త ఆలోచించామని, కానీ ఇప్పుడు పరిస్థితి చక్క బడింది కనుక రిలీజ్ చేస్తున్నామని అన్నారు. అరవింద్ గారు సినిమాని డిసెంబర్ లోనే రిలీజ్ చేయడం పై ఇతర అంశాలు ప్రభావం చాలానే ఉన్నా వాటితో పాటే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ విజయం కూడా వాళ్లలో ధైర్యం పెరిగి, నమ్మకంగా సినిమాని రిలీజ్ చేయడానికి ఎంతో కొంత ప్రోత్సహించిందన్నది వాస్తవం. అలాగే శ్రీనివాస్ రెడ్డి కూడా నిఖిల్ బాటలోనే కథను నమ్ముకుని తన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ను ధైర్యంగా విడుదల చేసి మంచి ప్రశంసలు పొందుతున్నాడు.

 
Like us on Facebook