ఎన్టీఆర్ ‘నిప్పులాంటి మనిషి’కి 40 ఏళ్ళు..!

ఎన్టీఆర్ ‘నిప్పులాంటి మనిషి’కి 40 ఏళ్ళు..!

Published on Oct 25, 2014 11:27 AM IST

S.r-NTR
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన ‘నిప్పులాంటి మనిషి’ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 40 ఏళ్ళు. అక్టోబర్ 25, 1974న విజయదశమి కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 కేంద్రాలలో 46 థియేటర్లలో, బెంగుళూరులో 4 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సొంతం చేసుకుంది.

ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన తొలి కలర్ సినిమా ఇదే కావడం విశేషం. హిందీలో అమితాబ్ బచ్చన్ కు యాంగ్రీ యంగ్‌మేన్‌ ఇమేజ్ తెచ్చిపెట్టిన ‘జంజీర్’ సినిమాకు రీమేక్ ఈ ‘నిప్పులాంటి మనిషి’. తెలుగులో ఎన్టీఆర్ కు కూడా అదే తరహా ఇమేజ్ లభించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ఒక్క పాట కూడా లేకపోవడం మరో విశేషం.

పక్కా కమర్షియల్ ఫార్ములాతో రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తర్వాత కాలంలో అనేక సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పోలీస్‌ కథా చిత్రాలకు ట్రెండ్‌ సెట్టర్‌ గా నిలిచింది ఈ సినిమా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు