ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని మరో నిర్మాత ప్రకటన !

నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా ఆయన తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ బయోపిక్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే, ప్రముఖ దర్శకుడు తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు, జనవరిలో సినిమా ప్రారంభం కానుంది. అయితే ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.గురు శిష్యులు ఇద్దరు ఎన్టీఆర్ పై సినిమా చెయ్యబోతున్నందుకు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానంటూ తాజాగా మరో నిర్మాత కూడా ప్రకటించాడు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఎన్టీఆర్ పై సినిమా తీస్తానని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. తన చిత్రంలో సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని కూడా ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Like us on Facebook