తాను చనిపోలేదంటున్న సీనియర్ దర్శకుడు !

తాను చనిపోలేదంటున్న సీనియర్ దర్శకుడు !

Published on Jan 16, 2018 4:33 PM IST


ఎవరైనా ఒక సెలబ్రిటీ కొన్ని రోజులపాటు లైమ్ లైట్లో లేకపోతే వాళ్ళు చనిపోయారని. లేకపోతే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని రక రకాల వార్తలు పుట్టుకురావడం సర్వ సాధారణమైపోయింది. ఈ చర్యలు సీనియర్ వ్యక్తుల విషయంలో మరీ ఎక్కువయ్యాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ దర్శకుడు రజనీకాంత్ తో ‘చంద్రముఖి’ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన పి. వాసు చనిపోయారని వార్తలు బయటకొచ్చాయి.

వీటిపై స్పందించిన దర్శకుడు పి.వాసు తాను బాగానే ఉన్నానని, ఆరోగ్యం కూడా బాగుందని, జిమ్ నుండి తిరిగొస్తుంటే ఈ వార్త తెలిసిందని, తన ఆరోగ్యం పటేల్ కంగారుపడిన అందరికీ ధన్యవాదాలని చాలా సున్నితంగా స్పందించారు. ఇటీవలే తమిళంలో లారెన్స్ తో ‘శివలింగ’ అనే సినిమా చేసిన అయన ఇంకో మూడు సినిమాలకు సైన్ చేసి ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు