డిసెంబర్ 7న పటాస్ ఆడియో

డిసెంబర్ 7న పటాస్ ఆడియో

Published on Nov 28, 2014 4:06 AM IST

Pataas
చాలా కాలంగా సరైన హిట్ అంటూ లేక నందమూరి కళ్యాణ్ రామ్ సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం తను చేస్తున్న ‘పటాస్’ సినిమా షూటింగ్ ని పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 7న విడుదలచేయనున్నారు

సాయి కార్తీక్ సంగీత దర్శకుడు. అనీల్ రావిపూడి దర్శకుడు. కళ్యాణ్ రామ్ సరసన పంజాబీ హీరోయిన్ శృతి సోధి హీరోయిన్ గా కనిపించనుంది. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు