పవన్ – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అప్డేట్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కొద్దిరోజుల క్రితమే కేరళలోని చిక్ మంగుళూరులో షెడ్యూల్ ప్రారంభించిన టీమ్ సుమారు మూడు రోజుల పాటు షూటింగ్ జరిపి తాజాగా ముగించింది. దీంతో పవన్ కళ్యాణ్ రాజకీయపరమైన పనుల్ని చక్కబెట్టుకునేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఇకపోతే త్వరలోనే టీమ్ యూరప్ వెళ్లనుందట.

15 రోజుల పాటు ఉండనున్న ఈ ఫారిన్ షెడ్యూల్లో పవన్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ పై పాటలు చిత్రీకరణ జరగనుంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 10న సంక్రాతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా నిర్మాణ సంస్థ ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్, త్రివిక్రమ్ లు కలిసి చేస్తున్న చిత్రం కావేడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు చిత్ర హక్కుల్ని భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు.

 

Like us on Facebook