ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘ రాజావారు రాణిగారు !

ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘ రాజావారు రాణిగారు !

Published on Nov 18, 2019 10:42 PM IST

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘ రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకం పై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజావారు రాణిగారు’. కాగా తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ లోని కథాంశం పాత్రలు మరియు సన్నివేశాల షాట్స్ చాల బాగున్నాయి. ట్రైలర్ ను చూస్తుంటే.. సినిమా పల్లెటూరిలో పుట్టి పెరిగిన వాళ్ళకు తమ జ్ఞాపకాల్ని గుర్తు చేసే విధంగా అలాగే ఈ సినిమా మంచి ప్రేమకథతో తెరకెక్కినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక కంటెంట్ ఉన్న సినిమాలకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలతో సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ ఉంది. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు