కన్నడ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన రాజమౌళి !
Published on Apr 20, 2017 2:53 pm IST


ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి – ది కంక్లూజన్’ విడుదలకు కర్ణాటకలో సమస్యలు మొదలైన సంగతి తెల్సిందే. కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ గతంలో కావేరీ జలాల విషయమై చేసిన కామెంట్స్ కు నొచ్చుకున్న కన్నడిగులు ప్రస్తుతం ఆయన నటించిన ‘బాహుబలి-2’ విడుదలను నిలిపివేస్తామని, సత్యరాజ్ బహిరంగ క్షమాపణ చెబితేనే విడుదలను ఆమోదిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా కన్నడిగులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ట్వియితీ ద్వార మాట్లాడిన రాజమౌళి ‘సత్యరాజ్ కావేరీ జలాల విషయమై ఎప్పుడో 9 ఏళ్ళ క్రితం కామెంట్స్ చేశారు. వాటికి, ఈ సినిమా నిర్మాతలకు ఎలాంటి సంబంధం లేదు. ఇన్నేళ్ళలో ఆయన నటించిన సినిమాలు ఎన్నో కన్నడలో రిలీజయ్యాయి. బాహుబలి పార్ట్ 1 కూడా వచ్చింది. దానికి చూపిన ఆదరణే రెండవ పార్ట్ పై కూడా చూపుతారని ఆశిస్తున్నాము. సత్యరాజ్ ఈ సినిమాలో నటించిన అనేక మంది నటీనటుల్లో ఒకరు మాత్రమే. ఆయన ఈ చిత్రానికి దర్శకుడు కాదు, నిర్మాత కాదు. ఈ పరిస్థితిని ఆయనకు వివరించాం కూడా. మాకు సంబంధం లేని వ్యవహారంలోకి మమల్ని లాగొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం’ ఆన్నారు.

 
Like us on Facebook