వరుస సినిమాలతో దూసుకుపోతోన్న అక్కినేని హీరో నాగ చైతన్య తాజాగా ఈ ఉదయం ఓ కొత్త సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాతో కృష్ణ మారిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ కూడా పనిచేస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పలు సినిమాలకు ప్రొడక్షన్ టీమ్‌లో పనిచేసిన ఆయన, వేరే ఇతర సినిమాలకు ట్రైలర్, ప్రోమోస్ కూడా రూపొందించేవారు.
ఇక ఇప్పుడు చైతూ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. కొత్త ప్రారంభమిదని తెలుపుతూ కార్తికేయ, సినిమా లాంచ్ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చైతూ స్టైల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనుందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.
New beginnings! All set to roll! Seeking all your support and wishes guys! :pray::pray::pray: https://t.co/rTMdjyDSvH
— S.S.Karthikeya (@ssk1122) February 7, 2017
- పోల్: వీరిలో ఎన్టీఆర్ బయోపిక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది ?
- జూలై 7 నుండి కొత్త సినిమా షూటింగ్లో పాల్గొననున్న ప్రభాస్ !
- చైనాలో సరికొత్త రికార్డ్ నెలకొల్పిన ‘బాహుబలి-2’ !
- ఆసక్తికరమైన సినిమాలతో వస్తున్న సీనియర్ హీరో !
- కాలా ప్రసార హక్కులు దక్కించుకున్న ప్రముఖ ఛానల్
సంబంధిత సమాచారం :
