‘బ్రూస్ లీ’ సినిమా తర్వాత 3 నెలలు గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది, అందుకే ఈ సినిమాని మొదట జనవరి మూడవ వారంలో అధికారికంగా లాంచ్ చేసి ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళాలని అనుకున్నారు. కానీ తాజాగా జనవరిలో కాకుండా ఫిబ్రవరి 2వ వారంలో లాంచ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఎందుకిలా అని ఈ చిత్ర సన్నిహిత వర్గాలని కనుక్కోగా వారు మాకు చెప్పిన సమాచారం..
ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన పర్సనల్ గా ఉన్న కొన్ని పనులను పూర్తి చేసుకోవడం కోసం యుఎస్ వెళ్ళాడు. ఆయన అన్ని పనులను పూర్తి చేసుకొని తిరిగి రావడానికి మరో 20 రోజులు టైం పడుతుంది. ఎక్కువభాగం సంక్రాంతి తర్వాతే సురేందర్ రెడ్డి తితిగి వస్తాడు. ఆయన వచ్చాక ఓ సారి ఫైనల్ స్క్రిప్ట్ నేరేషన్ ఇస్తారు. అందుకే రామ్ చరణ్ సినిమాని జనవరి నుంచి ఫిబ్రవరి 10న లాంచ్ చేయడానికి ఫిక్స్ అయ్యారని ఈ చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్ సరసన శృతి హీరోయిన్ గా నటించనుండగా, అరవింద్ స్వామి మెయిన్ విలన్ గా నటించనున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించనున్నాడు.


