‘బాహుబలి’ ఇంట్రడక్షన్ ఫైట్ కంప్లీట్ చేసిన రానా

‘బాహుబలి’ ఇంట్రడక్షన్ ఫైట్ కంప్లీట్ చేసిన రానా

Published on Oct 30, 2014 12:14 PM IST

rana
ఆరడుగుల అందగాడు దగ్గుబాటి రానా భళ్లాల దేవుడుగా నటిస్తున్న సినిమా ‘బాహుబలి’. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బుధవారంతో తన ఇంట్రడక్షన్ ఫైట్ ను కంప్లీట్ చేశాడు రానా. ఈ షెడ్యూల్లో తన షూటింగ్ పార్ట్ పూర్తవడంతో హిందీ సినిమా ‘బేబీ’ షూటింగ్ లో పాల్గొనడానికి అబూ దాబి వెళ్ళాడు.

ఈ షెడ్యూల్ తర్వాత మూవీ యూనిట్ బల్గేరియా వెళ్లనున్నారు. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక సినిమా కోసం అంతర్జాతీయ గ్రాఫిక్స్ నిపుణులు పని చేస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, సత్యరాజ్, అడవి శేష్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యం.యం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమిళంలో ‘మహాబలి’ పేరుతో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు