సెన్సార్ కి రెడీ అయిన ‘గోవిందుడు.. ‘

సెన్సార్ కి రెడీ అయిన ‘గోవిందుడు.. ‘

Published on Sep 22, 2014 7:27 PM IST

Govindudu-Andarivadele
సినిమాని ఎట్టి పరిస్థితులలో అక్టోబర్ 1న విడుదల చేయాలని కృత నిశ్చయంతో ఉన్న ‘గోవిందుడు అందరివాడేలే’ మూవీ యూనిట్ సభ్యులు..
ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్ పగలు షూటింగ్ లో పాల్గొంటూ రాత్రి పూట డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేస్తున్నాడు. ఈ శుక్రవారం సెన్సార్ బోర్డు వద్ద నిర్మాత బండ్ల గణేష్ స్లాట్ బుక్ చేసినట్టు చెప్తున్నారు. సెప్టెంబర్ 26న సినిమా సెన్సార్ బోర్డు ముందుకు వెళ్తుందని సమాచారం.

ఫ్యామిలీ సెంటిమెంట్ సన్నివేశాలను కృష్ణవంశి అద్బుతంగా తెరకెక్కించారు. సినిమాలో చివరి 30 నిముషాలు, క్లైమాక్స్ హైలైట్ అవుతాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ‘గోవిందుడు.. ‘తో కృష్ణవంశి తన మార్క్ చూపించడం ఖాయమని అంటున్నారు. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన పాటలు సినిమాలో ఫీల్ ను ప్రతిబింభించేలా ఉన్నాయి.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు