ఇప్పట్నుంచే సంక్రాంతి సినిమాలకు అసలు పరీక్ష!

ఇప్పట్నుంచే సంక్రాంతి సినిమాలకు అసలు పరీక్ష!

Published on Jan 17, 2017 12:30 PM IST

khaidi-gpsk-shatamanm
తెలుగు సినిమాకు సంక్రాంతి ఎంత పెద్ద సీజనో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సంక్రాంతికి తమ సినిమా వస్తే కాసుల పంట పండుతుందని ప్రతి హీరో అభిమానీ కోరుకుంటూ ఉంటాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి మూడు క్రేజ్ ఉన్న సినిమాలు రాగా, అన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మూడు సినిమాలూ హిట్ స్టేటస్‌ను దక్కించేసుకున్నాయి. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ రికార్డు కలెక్షన్స్ సాధిస్తూ ఉండగా, నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి, ఆయన కెరీర్‌కే అతిపెద్ద హిట్‌గా నిలవనుంది. ఇక ఈ పెద్ద సినిమాల మధ్యన వచ్చిన ‘శతమానం భవతి’ కూడా సూపర్ హిట్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

సంక్రాంతి అనేది పెద్ద సీజన్ కావడం, అందరికీ సెలవులు కావడంతో మొదటి వారాంతం అన్ని సినిమాలూ బాక్సాఫీస్ వద్ద కళకళలాడాయి. ఇక ఇప్పుడు సెలవులన్నీ పూర్తయి అందరూ ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోవడంతో, ఇకపై ఈ సినిమాలన్నీ ఎలా ఆడతాయన్నదే ప్రధానం కానుంది. ఈవారం సినిమాలేవీ విడుదల కావడం లేదు కాబట్టి సంక్రాంతి సినిమాలకు మరో పదిరోజులు ఎటువంటి అడ్డంకులు లేవు. ఈ సమయంలో, ఏయే సినిమా ఎంత కలెక్ట్ చేసి, లాంగ్ రన్‌లో ఏ స్థాయి హిట్‌గా నిలుస్తుందన్నది ఎదురుచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు