రాఘవేంద్ర రావుగారి షోలో రామూతో స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీదేవి

రాఘవేంద్ర రావుగారి షోలో రామూతో స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీదేవి

Published on Sep 25, 2014 1:49 AM IST

RGV_Sridevi_Raghavendra_Rao
ఆర్.జి.వి పలు ఇంటర్వ్యూలలో శ్రీదేవి అంటేతనకు వల్లమాలిన అభిమానమని వెల్లడించాడు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి టాక్ షోలో వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోనున్నారు. ఇప్పటికే వీరిపై ఎపిసోడ్ ని షూట్ చెయ్యగా అది త్వరలో టెలికాస్ట్ అవ్వనుంది. గోవిందా గోవిందా, క్షణక్షణం సినిమాలలో ఆర్.జి.వి తన కెమెరా కళ్ళతో శ్రీదేవిని బంధించాడు

రామ్ గోపాల్ వర్మ ఈ రాఘవేంద్ర రావు గారి షోలో శ్రీదేవి పై నమ్మలేని నిజాలని ఏమన్నా చెప్పనున్నాడా అన్నది ఆసక్తికరం. రామూ ప్రస్తుతం ఐస్ క్రీమ్ 2 చిత్రీకరణలో బిజీగా వున్నాడు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో విజయవాడలో విడుదలచేశారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు