అనుష్క ‘రుద్రమదేవి’ హిందీ రైట్స్ కి బంపర్ ప్రైజ్

అనుష్క ‘రుద్రమదేవి’ హిందీ రైట్స్ కి బంపర్ ప్రైజ్

Published on Aug 27, 2015 11:15 AM IST

rudramadevi
‘బాహుబలి’ సూపర్ హిట్ పీరియాడికల్ ఫిల్మ్ తర్వాత అందరి చూపు భారీ హిస్టారికల్ ఫిల్మ్ గా రానున్న ‘రుద్రమదేవి’పైకి షిఫ్ట్ అయ్యింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ కోసం 9 ఏళ్ళు పాటు క్షుణ్ణంగా పరిశోధించి గుణశేఖర్ ఈ సినిమా తీసాడు. ఇండియన్ ఫస్ట్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీగా వస్తున్న ‘రుద్రమదేవి’ సినిమా ఇన్ని రోజులు తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. తాజాగా ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడానికి సిద్దమయ్యారు.

అంతే కాకుండా రుద్రమదేవి హిందీ వెర్షన్ రైట్స్ అదిరిపోయే బంపర్ ప్రైజ్ పలికింది. హిందీలో బాగా ఫేమస్ అయిన అభిషేక్ పిక్చర్స్ – రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు వరల్డ్ వైడ్ హిందీ వెర్షన్ రైట్స్ ని సుమారు 22 కోట్లకి సొంతం చేసుకోవడం విశేషం. ఈ విషయంలో గుణశేఖర్ డబుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాలో మెయిన్ రోల్ చేసిన రానా బాలీవుడ్ కి సుపరిచితుడే, అలాగే బాహుబలితో అనుష్కకి కూడా గుర్తింపు వచ్చింది. వీరిద్దరు మాత్రమే బాలీవుడ్ కి సుపరిచితులు కానీ ఈ రేటుకి అమ్ముడు పోవడం విశేషం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యం అవడం వల్ల ఈ సినిమాని సెప్టెంబర్ 4 నుంచి వాయిదా వేసారు. అలాగే న్యూ రిలీజ్ డేట్స్ కోసం సెప్టెంబర్ 17 లేదా 25 ని పరిశీలిస్తున్నారు.

రుద్రమదేవి కథలో కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రానా, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు