శ్రీమంతుడి ప్రచారంలో శృతిహాసన్

శ్రీమంతుడి ప్రచారంలో శృతిహాసన్

Published on Jul 31, 2015 1:12 AM IST

Shruthi-hasan1
విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్ లు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

ఇప్పటికే మహేష్ బాబు చిత్ర ప్రచారాలతో బిజీగా వున్నాడు. వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలతో బిజీగా వున్న మహేష్ తో ఇప్పుడు శృతి హాసన్ కూడా జతకలవనుంది. త్వరలో హైదరాబాద్ చేరుకొని ప్రచారాలలో భాగంకానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం శృతి అజిత్ సరసన ఒక తమిళ చిత్రంలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు