సిద్ధార్థ్ క్రేజీ సినిమా రిలీజ్‌కు రెడీ!

సిద్ధార్థ్ క్రేజీ సినిమా రిలీజ్‌కు రెడీ!

Published on Feb 8, 2016 8:01 PM IST

sidharth
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోగా మంచి స్టార్‌డమ్ సంపాదించుకున్న సిద్ధార్థ్, తాజాగా ‘జిల్ జంగ్ జక్’ అనే సినిమాతో సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా తన ఇమేజ్‌కు భిన్నంగా కొత్తదనం ఉన్న ప్రయోగాలనే చేసుకుంటూ వెళుతోన్న సిద్ధార్థ్, అదే కోవలో ఓ ప్రయోగాత్మక కథతో ‘జిల్ జంగ్ జక్’ అనే సినిమా చేశారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 12న) తమిళనాట పెద్ద ఎత్తున విడుదల కానుంది.

దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఆసక్తి రేకెత్తించింది. దీరజ్ వైడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డార్క్ కామెడీపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. నిజానికి డిసెంబర్ నెలాఖర్లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా చెన్నై వరదలు సృష్టించిన బీభత్సం వల్ల ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేసేందుకు సిద్ధార్థ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మార్చిలో తెలుగు వర్షన్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు