ఇంటర్వ్యూ : సాయి పల్లవి – సావిత్రి, సౌందర్యతో పోల్చడం ఆనందంగా ఉంది !

ఇంటర్వ్యూ : సాయి పల్లవి – సావిత్రి, సౌందర్యతో పోల్చడం ఆనందంగా ఉంది !

Published on Jul 26, 2017 1:10 PM IST


శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘ఫిదా’ తో హీరోయిన్ సాయి పల్లవి బోలెడంత స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకుగాను తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ స్థాయి ఆదరణను మీరు ఊహించారా ?
జ) సినిమా హిట్టవుతుందని తెలుసు కానీ ఇంత పెద్ద హిట్టవుతుందని, ప్రేక్షకులు నన్ను ఇంతలా ఆదరిస్తారని మాత్రం ఊహించలేదు. థియేటర్లో ఆడియన్స్ స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

ప్ర) శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ చెప్పగానే ఏమనిపించింది ?
జ) కథ వినగానే తెలంగాణా అమ్మాయిగా నేను సరిపోతానా, అది కూడా నా వాయిస్ లో డబ్బింగ్ చెప్పడం కుదురుతుందా అనుకున్నా కానీ శేఖర్ కమ్ములగారు నన్ను ఆ పాత్రలోకి మార్చడం కోసం చాలా కష్టపడ్డారు. ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.

ప్ర) భానుమతిగా మారడానికి ఏం చేశారు ?
జ) కొన్ని వర్క్ షాప్స్ చేశాం. ఆ తర్వాత ముఖ్య నటీ నటులతో సన్నివేశాలని ప్రాక్టీస్ చేశా. ఇక పల్లెటూరి అమ్మాయిలు చేసే ట్రాక్టర్ నడపడం వంటి చిన్న చిన్న పనుల్ని నేర్చుకున్నా.

ప్ర) మేకప్ లేకుండా నటించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు కదా దాని గురించి ఏమంటారు ?
జ) అది ట్రెండ్ కాదు. ఈ సినిమా ద్వారా శేఖర్ కమ్ములగారు పింపుల్స్ ఉన్న అమ్మాయిలు, మామూలుగా కనిపించే అమ్మాయిలు కూడా జీవితంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారని చూపించారు. అయన ఆడవాళ్లకి ఒక కొత్త ఐడెంటిటీ ఇచ్చారు.

ప్ర) ఈ సినిమాకు మీకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ?
జ) మేము పనిచేసిన క్రూలో ఒక వ్యక్తికి తెలంగాణ బాష అంటే అస్సలు ఇష్టముండేది కాదు. తన పిల్లల్ని కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. కానీ సినిమా చూసిన తర్వాత భాష గొప్పతనం ఆయనకు తెలిసింది. తెలంగాణా భాష పట్ల గర్వంగా ఫీలవుతున్నారు. అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అంతేగాక కొంతమంది సావిత్రి, సౌందర్యలా నటిస్తున్నావని అంటున్నారు. అది కూడా బాగుంది.

ప్ర) సీనియర్ నటుడు సాయి చాంద్ తో నటించడం ఎలా ఉంది ?
జ) ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. షూటింగ్ సమయంలో ఆయన న నిజమైన తండ్రి అయిపోయారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన ఏడ్చేటప్పుడు వాటిలో నేను లేకపోయినా కూడా ఎమోషనల్ అయ్యేదాన్ని. చాలా బాగా నటించారు.

ప్ర) వరుణ్ తేజ్ తో మీ కెమిస్ట్రీ ఎలా ఉండేది ?
జ) వరుణ్ తేజ్ చాలా సిగ్గుపడేవాడు. పెద్దగా మాట్లాడేవాడు కాదు. పని చూసుకుని సెట్ నుండి వెళ్లిపోయేవాడు. తన నటనలో ఎమోషన్ తో మా కెమిస్ట్రీ ఇంకా బాగా పండేలా చేశాడు.

ప్ర) మీ డ్యాన్సులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏమంటారు ?
జ) నేను డ్యాన్స్ బాగా చేస్తాను. ప్రొపెషనల్ గా నేర్చుకున్నాను. ఈ సినిమాలో నా డ్యాన్సుకు చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఈ క్రెడిట్ అంతా శేఖర్ మాస్టర్ కే దక్కుతుంది. వచ్చిండే పిల్లా, ఏందిరో పిల్లగాడా వంటి పాటలు బాగా క్లిక్ అయ్యాయి.

ప్ర) మీకు బాగా ఇష్టమైన నటుడు ఎవరు ?
జ) కాలేజ్ రోజుల్లో సూర్య అంటే చాలా ఇష్టం. ఆయన ప్రతి సినిమాని వదలకుండా చూసేదాన్ని. ఆయనతో కలిసి నటించే అవకాశమొస్తే అస్సలు వదులుకోను.

ప్ర) మీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి ?
జ) నేను ఎంబిబిఎస్ పూర్తి చేశాను. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. ఎప్పటికైనా కార్డియాలజీ చేసి డాక్టర్ గా సెటిలవుతాను.

ప్ర) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ?
జ) ప్రస్తుతం నానితో చేస్తున్న ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ షూటింగ్ జరుగుతోంది నాగ శౌర్యతో సినిమా కంప్లీట్ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు