యాక్షన్ టీజర్ తో దుమ్ములేపిన నాగ చైతన్య

యాక్షన్ టీజర్ తో దుమ్ములేపిన నాగ చైతన్య

Published on Nov 23, 2015 2:37 PM IST

Sahasam-Swasaga-Sagipo
అక్కినేని నగ్ చైతన్య – గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ‘ఏ మాయ చేసావే’. ఇలాంటి ఓ రేంజ్ హిట్ ఇచ్చిన వీరి కాంబినేషన్ లో రానున్న మరో సినిమానే ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి, ఆ అంచనాలను అందుకునేలా సినిమా తీయడం అనేది చాలా ముఖ్యం. తాజాగా ఈ చిత్ర టీం రిలీజ్ చేస్తున్న టీజర్స్ ని చూస్తుంటే ఆ అంచనాలను అందుకునేలానే ఉందని సినీ అభిమానులు చెబుతున్నారు. అక్కినేని నాగార్జున బర్త్ డే కానుకగా మొదటి రొమాంటిక్ టీజర్ ని రిలీజ్ చేసారు. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు నాగ చైతన్య బర్త్ డే.. ఈ సందర్భంగా ఈ చిత్ర టీం నాగ చైతన్యపై కట్ చేసిన ఓ యాక్షన్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ పవర్ ప్యాక్ యాక్షన్ టీజర్ కి మరియు అందులో నాగ చైతన్యని చూపిన విధానం, డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మూవీ లవర్స్ అయితే టీజర్ అదిరిపోయిందని నాగ చైతన్యకి కితాబులిచ్చారు. అలాగే సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉండనుంది. మొదటి అర్ధభాగం చాలా రొమాంటిక్ గా ఉంటే, రెండవ అర్ధభాగం యాక్షన్ పార్ట్ తో చాలా థ్రిల్లింగ్ గా ఉండనుంది. కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ మొత్తం పూర్తి చేసుకొని జనవరిలో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

నాగచైతన్య సరసన మలయాళ భామ మంజిమ మోహన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ తమిళ్ వెర్షన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు