Like us on Facebook
 
సినిమా పోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానన్న స్టార్ హీరో !


బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం నటిస్తున్న జగ్గా జాసూస్ చిత్రం ద్వారా నిర్మాతగా కూడా మారాడు. తొలిసారి నిర్మాతగా భాద్యతలు నిర్వహిస్తున్న రణబీర్ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా తాజాగా జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో రణబీర్ పాల్గొన్నాడు. ఒకవేళ జగ్గా జాసూస్ చిత్రం విఫలమైతే డిస్ట్రిబ్యూటర్ లకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని రణబీర్ తెలిపాడు.

తన తాత లెజండ్రీ నటుడు రాజ్ కపూర్ కూడా గతం లో ఇలానే చేసారని రణబీర్ తెలిపాడు. మేరా నామ్ జోకర్ చిత్రం విఫలమైన తరువాత బాబీ చిత్రం ఘనవిజయం సాధించింది. దీనితో మేరా నామ్ జోకర్ డిస్ట్రిబ్యూటర్ లకు డబ్బులు తిరిగి ఇచ్చేశారని రణబీర్ తెలిపాడు. కాగా నిన్న విడుదలైన జగ్గా జాసూస్ చిత్రానికి ఆశించిన స్థాయి రివ్యూ లు రాలేదు.

Bookmark and Share