తల్లికి పుట్టినరోజు కానుక ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న స్టార్!

paandi

తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోల్లో ఒకరుగా కొనసాగుతూ వస్తోన్న ధనుష్, హీరోగానే కాక, నిర్మాతగా, గాయకుడిగా.. ఇలా చాలా పాత్రల్లోకి ప్రవేశించి అభిమానులను మెప్పించారు. తాజాగా ఆయన దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతూ ‘పవర్ పాండి’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ అయిన వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే సగభాగం పైగా షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పూర్తవుతోంది.

ఇక తాజాగా ఈ సినిమాకు ధనుష్ ఒక విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 14, 2017న తమిళ సంవత్సర కానుకగా సినిమా విడుదల కానుందని ధనుష్ స్పష్టం చేశారు. అదేరోజున తన తల్లి విజయలక్ష్మి పుట్టినరోజు కూడా ఉండడంతో, ఆమెకు తానిచ్చే గిఫ్ట్ ఈ సినిమాయే అవుతుందని ధనుష్ తెలిపారు. తమిళంలో నటుడిగా మంచి పేరున్న రాజ్ కిరణ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విశాల్ నటించిన ‘పందెం కోడి’ అన్న సినిమాతో రాజ్ కిరణ్ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 

Like us on Facebook