ఇంటర్వ్యూ: శ్రీనివాస్ రవీంద్ర – నా సినిమాకు కథ, స్క్రీన్ ప్లే ప్రధానమైన బలాలు

ఇంటర్వ్యూ: శ్రీనివాస్ రవీంద్ర – నా సినిమాకు కథ, స్క్రీన్ ప్లే ప్రధానమైన బలాలు

Published on Feb 20, 2017 3:34 PM IST


‘పెళ్లి చూపులు’ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ద్వారక’. ఈ చిత్రంతో శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మార్చి 3న ఈ సినిమా రిలీజ్ సందర్బంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..

ప్ర) మీ నైపథ్యం గురించి చెప్పండి ?
జ) మాది పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఎంఏ సైకాలజీ చేశాను. చదువైపోయాక రెండేళ్లు బిజినెస్ చేశాను. కానీ అందులో ఉండలేక నా స్నేహితుడి ద్వారా 2002లో అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. మొదట సహాయ దర్శకుడిగా, రచయితగా పనిచేశాను. తమ్మారెడ్డి భరద్వాజ్, పవన్ కళ్యాణ్ వంటి వారి దగ్గర వర్క్ చేశాను.

ప్ర) ఈ సినిమా అసలు ఎలా ఉండబోతోంది ?
జ) ఇది పూర్తిగా ద్వారక అనే అపార్ట్మెంట్ మీద నడిచే కథ. కథలోని పాత్రలన్నీ అక్కడే ఉంటాయి. కృష్ణుడిలోని అనేక అంశాలను టచ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ప్రేమ నైపథ్యంలో నడిచే కథ. అలా అని పూర్తిగా లవ్ స్టోరీ కాదు.

ప్ర) ఇందులో విజయ్ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో విజయ్ పేరు ఎర్ర శ్రీను. దొంగతనాలు చేస్తుంటాడు. అనేక ఆటుపోట్లను ఎదుర్కున్న అతని జీవితం ఎలా సాగింది అనేదే ఈ సినిమాలో చూపుతాం.

ప్ర) ‘పెళ్లి చూపులు’ విజయ్ కి ‘ద్వారక’ విజయ్ కి ఏంటి తేడా ?
జ) అందులో విజయ్ ది బద్ధకంగా ఉండే ఒక కుర్రాడి పాత్ర. ఒక యాంగిల్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఇందులో మాత్రం డిఫరెంట్ యాంగిల్స్ అంటే దొంగగా, ప్రేమికుడిగా, దేవుడిగా కనిపిస్తాడు.

ప్ర) ఈ సినిమాలో విజయ్ పాత్ర పట్ల ప్రేక్షకులు ఎలా సంతృప్తి చెందుతారు ?
జ) ఇక్కడ హీరో ఇమేజ్, స్టార్ డమ్ అనే పెద్ద విషయాలేమీ చెప్పను. విజయ్ పట్ల ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ ఉంది. ఆ క్యూరియాసిటీని శాటిసిఫై చేస్తాను అంతే.

ప్ర) ఇంతకు ముందు దేవుడు అని అన్నారు. అంటే దేవుడి మీద మెసేజ్ ఇస్తున్నారా ?
జ) లేదు. పూర్తిగా దేవుడి మీద కథ నడవదు. అదొక యాంగిల్ మాత్రమే. దేవుడి ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది అని నాలో మొదలైన ప్రశ్నకు సమధానం ఇందులో చూపుతాను. మెసేజ్ లాంటివి ఏవీ ఇవ్వను. ఇదొక వ్యంగ్య మైన కామెడీతో నడిచి కథ.

ప్ర) సినిమా పూర్తై చాలా రోజులైంది. మరి ఇంత ఆలస్యం ఎందుకు ?
జ) అవును. సినిమా పెళ్లి చూపులు కంటే ముందు పూర్తయింది. కానీ డీమానిటైజేషన్ సమస్య వలన రిలీజ్ ఆలస్యమైంది.

ప్ర) ఈ కథకు విజయ్ ను ఎలా ఎంచుకున్నారు ?
జ) విజయ్ నాకు ముందునుండే తెలుసు. అతని మొదటి సినిమాలోనే అతనిలో ఏదో స్పార్క్ ఉందని గమనించా. నిర్మాతలకు అతని పేరు సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకున్నారు.

ప్ర) ఈ సినిమాలో మీరు ఎలా ఎంటర్టైన్ చేస్తారు ?
జ) ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు విజువల్స్ తో ఎంటర్టైన్ చేస్తే కొందరు యాక్షన్ తో చేస్తారు. నేను మాత్రం స్క్రిప్ట్ వర్క్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాను. ఈ సినిమాకి కథే ప్రధాన బలం. స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది.

ప్ర) ఇందులో హీరో ఫైట్స్, డాన్సులు లాంటివి ఏమైనా చేశారా ?
జ) విజయ్ ఇందులో డ్యాన్సులు చేశాడు. దాని కోసం అతన్ని ప్రత్యేకంగా తయారు చేశాం. అతనిలో ఇదొక కొత్త యాంగిల్. ఇక ఫైట్స్ అంటే సపరేట్ గా ఏమీ ఉండవు. కథలో భాగంగా కొన్ని ఉంటాయంతే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు