వెనక్కి వెళ్లిన సూర్య సింగం !

వెనక్కి వెళ్లిన సూర్య సింగం !

Published on Dec 2, 2016 6:15 PM IST

s3
హీరో సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సినిమాలు రెండు ‘సింగం’ సిరీస్ లోనివే. ఇప్పుడు ఈ సిరీస్ నుండే ‘సింగం 3’ పేరుతో మరో పవర్ ఫుల్ సినిమా రాబోతోంది. డాషింగ్ డైరెక్టర్ హరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాని ముందుగా డిసెంబర్ 16న రిలీజ్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి తరుణంలో కొద్ది సేపటి క్రితమే డిసెంబర్ 23ను కొత్త డేట్ గా ప్రకటించారు.

ఈ వాయిదా వెనకున్న సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సింగం సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో ఈ మూడవ పార్ట్ మీద కూడా అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. స్టూడియో గ్రీన్ సంస్థ పతాకంపై కె ఇ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగులో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ సమర్పిస్తున్నారు. ఇక అనుష్క, శృతి హాసన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు