మరో స్పెషల్ సాంగ్ లో మెరవనున్న తమన్న!

మరో స్పెషల్ సాంగ్ లో మెరవనున్న తమన్న!

Published on May 22, 2018 1:09 PM IST

తమన్న భాటియా ఇటు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ లోను మెరుస్తోంది. ‘అల్లుడు శీను , జై లవ కుశ’ తదితర చిత్రాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ కు మంచి గుర్తింపు లభించింది. అందుకే స్టార్ హీరోల సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న’సవ్యసాచి’ చిత్రంలో నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ ‘హలో బ్రదర్’లోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు’ అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు.

ఈ పాటలో చైతూతో ఆడి, పాడే అవకాశం తమన్నాకు దక్కింది. నాగార్జున, రమ్యకృష్ణ కలయికలో వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఈ సాంగ్ ఒరిజినల్ కంపోజర్ ఎం.ఎం.కీరవాణి ఈ రీమిక్స్ సాంగ్ ని కూడా కంపోజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూకు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు