‘భరత్ అనే నేను’ లో పాట పాడిన తమిళ హీరోయిన్ !
Published on Nov 12, 2017 1:01 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో టీఆర్ స్థాయి అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి తెలిసిన తాజా విశేషాల ప్రకారం ఇందులో ప్రముఖ తమిళ హీరోయిన్ ఆండ్రియా ఒక పాట పాడారట. దేవిశ్రీ ప్రసాద్ దగ్గరుండి ఈ పాటను పాడించారని, తాను దేవి వర్క్ కు ఎన్నాళ్లగానో పెద్ద అభిమానినని, ఆయన పర్యవేక్షణలో పాడటం ఆనందంగా ఉందని అన్నారు.

స్వతహాగా ప్లేబాక్ సింగర్ అయిన ఆండ్రియా గతంలో ‘రాఖీ’ సినిమాలో జర జర అనే పాటను పాడారు. ఇకపోతే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని వచ్చేఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook