షార్ట్‌ఫిల్మ్‌లో నటించేందుకు సిద్ధమైన తాప్సీ?

షార్ట్‌ఫిల్మ్‌లో నటించేందుకు సిద్ధమైన తాప్సీ?

Published on Aug 3, 2015 4:26 PM IST

Taapsee
తెలుగు, తమిళం, హిందీ ఇలా మూడు ప్రధాన భాషల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ, గత కొంతకాలంగా కేవలం నటిగా తానేంటో నిరూపించుకునే పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వెళుతున్నారు. ఈ కోవలోనే ఆమె నటించిన బాలీవుడ్ సినిమా ‘బేబీ’, తమిళ సినిమా ‘కాంచన 2’ (తెలుగులో గంగ) సినిమాలు తాప్సీకి ఇంతకుముందు ఏ సినిమా తెచ్చిపెట్టని క్రేజ్, గుర్తింపును తెచ్చిపెట్టాయి. దీంతో ప్రస్తుతం ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతూ రీసెంట్‌గా కన్నడ సినీ పరిశ్రమకూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఇదిలా ఉంటే సినిమాల్లో బిజీగా ఉన్న ఈ టైమ్‌లోనే తాప్సీ ఓ షార్ట్ ఫిల్మ్ చేసేందుకు సిద్ధమవడం విశేషంగా కనిపిస్తోంది. ‘పాన్ సింగ్ తోమార్’, ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ సినిమాలతో విలక్షణ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టిగ్మన్షు దులియా ఓ వినూత్న షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించేందుకు ప్లాన్ చేసుకున్నారట. ఈ షార్ట్ ఫిల్మ్ కోసమై తాప్సీని సంప్రదించగా ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మధ్యే రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు సుజయ్ ఘోష్ తెరకెక్కించిన ‘అహల్య’ షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే! ‘అహల్య’ తరహాలోనే తాప్సీ నటించబోయే షార్ట్ ఫిల్మ్ కూడా ట్రెండ్ సృష్టించే స్క్రిప్ట్‌తో రానుందని టాక్!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు