ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి !

ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి !

Published on May 22, 2018 9:07 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో రూపొందుతున్న ‘అరవింద సమేత’ చిత్రంలో ప్రధాన కథానాయిక పూజా హెగ్డే కాకుండా మరొక హీరోయిన్ కూడ నటిస్తోందని వినికిడి. ఆ హీరోయిన్ మరెవరో కాదు తెలుగమ్మాయి ఈషా రెబ్బ. అవును.. కథలోని ఒక ముఖ్య పాత్ర కోసం తెలుగు బాగా మాట్లాడే హీరోయిన్ అయితే బాగుంటుందని వెతుకుతున్న త్రివిక్రమ్ ‘అమీ తుమీ’ సినిమాలో ఈషా పెర్ఫార్మెన్స్ చూసి ఆమెను సినిమాలోకి తీసుకున్నారట.

ఈ చిత్రంలో ఈషా పాత్ర రెగ్యులర్ హీరోయిన్లలా కాకుండా కొంత భిన్నంగా ఉంటుందని, ఆ పాత్ర ఆమెలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని చిత్ర సన్నిహిత వర్గాల టాక్. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఫస్ట్ లుక్ కి కూడ మంచి స్పందన లభించింది. ఇకపోతే రాయలసీమ బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ చిత్రంలో తారక్ రాయలసీమ యాసలో మాట్లాడతారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు