ఎన్టీఆర్, తమన్ లకు థాంక్స్ – శింబు

ఎన్టీఆర్, తమన్ లకు థాంక్స్ – శింబు

Published on Sep 13, 2014 3:02 PM IST

shamboo
‘బాద్ షా’ సినిమాలో ‘డైమండ్ గర్ల్… ‘ పాట పాడే అవకాశం నాకు ఇచ్చినందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంగీత దర్శకుడు తమన్ లకు చాలా థాంక్స్ అంటున్నాడు తమిళ యువ హీరో శింబు. ఈ పాటకు బెస్ట్ మేల్ సింగర్ సైమా – 2014 అవార్డు అందుకున్నాడు శింబు. తెలుగులో శింబు అందుకున్న తొలి అవార్డు ఇదే కావడం విశేషం.

మంచు మనోజ్ ‘పోటుగాడు’ సినిమాలో శింబు పాడిన బుజ్జి పిల్లా.. పాటకు కూడా ప్రసంశలు లభించాయి. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ఈ హీరో సింగింగ్ తో పాటు దర్శకత్వం, స్క్రిప్ట్ రైటింగ్ లో కూడా అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు