‘రుద్రమదేవి’లో డ్యూయల్ రోల్ చేసిన ఉల్కా గుప్త

‘రుద్రమదేవి’లో డ్యూయల్ రోల్ చేసిన ఉల్కా గుప్త

Published on Oct 21, 2014 2:35 PM IST

Ulka-Gupta
గతంలో కొంతమంది దర్శకులు హీరో, హీరోయిన్ లను చిన్నతనం ఎపిసోడ్ చూపించాలి అనుకున్నప్పుడు ఒకే అమ్మాయి లేదా అబ్బాయిని తీసుకొని అటు అబ్బాయిగా, ఇటు అమ్మాయిగా చూపించే వారు.. శ్రీదేవి ఇలాంటి పాత్రలు చాలా సార్లు చేసింది. ఇప్పుడు అదే పంథాని డైరెక్టర్ గుణశేఖర్ తన ‘రుద్రమదేవి’ సినిమాలో రిపీట్ చేసాడు.

‘రుద్రమదేవి’ సినిమాలో టైటిల్ రోల్ ని అనుష్క, తనకీ జోడీ అయిన ప్రిన్స్ పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. వీరి బాల్యం ఎపిసోడ్స్ లో వీరి పాత్ర చేయడానికి సరైన వారి కోసం వెతుకుతున్న టైంలో గుణశేఖర్ కి ‘ఝాన్సీ కి రాణి’ హిందీ టీవీ సీరియల్ లో చేసిన ఉల్కా గుప్త పెర్ఫార్మన్స్ చాలా బాగా నచ్చడంతో తనని ఎంపిక చేసారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రానా కనిపించాల్సిన చిన్నప్పటి యంగ్ ప్రిన్స్ పాత్రని మరియు అనుష్క కనిపించాల్సిన చిన్నప్పటి యంగ్ ప్రిన్సెస్ పాత్రల్లో ఉల్కా గుప్త నటించింది. అంటే అటు రానా చిన్నప్పటి గెటప్ లో మరియు అనుష్క చిన్నప్పటి గెటప్ లో ఉల్కా గుప్తనే కనిపించనుండడం విశేషం.

13వ శతాబ్దంలో కాకతీయుల ఔన్నత్యాన్ని చాటి చెప్పిన రుద్రమదేవి కథాంశంతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి మూవీ ఇదే కావడం విశేషం. గుణశేఖర్ దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవలే విడుదల చేసిన అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు