పూరి, క్రిష్ సినిమాలను కన్ఫర్మ్ చేసిన వరుణ్ తేజ్..

పూరి, క్రిష్ సినిమాలను కన్ఫర్మ్ చేసిన వరుణ్ తేజ్..

Published on Dec 21, 2014 8:55 PM IST

Varun1

‘ముకుంద’ సినిమాతో ఆరడుగుల అందగాడు, మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 24న సినిమా విడుదలవుతుంది. మొదట వరుణ్ తేజ్ డెబ్యూ మూవీకి దర్శకుడిగా పూరి జగన్నాధ్, క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ)ల పేర్లు కూడా వినిపించాయి. అయితే అవి ఫైనల్ కాలేదు.

‘ముకుంద’ తర్వాత వారిద్దరితో సినిమాలు చేస్తున్నట్టు ఈ మెగా హీరో కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ‘ముకుంద’ విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

ప్రస్తుతం పూరి జగన్నాధ్, ఎన్టీఆర్ ‘టెంపర్’తో.. క్రిష్ హిందీలో అక్షయ్ కుమార్ ‘గబ్బర్’ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాయి. మొదట ఎవరితో సినిమా మొదలుపెడతాడో..?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు