రవితేజ సినిమా, నాని సినిమా వేర్వేరట..!
Published on Nov 2, 2016 8:21 am IST

nani-venu-sriram
నాని ఇప్పుడు తిరుగన్నదే లేకుండా దూసుకుపోతోన్న స్టార్. ఏడాదిన్నరలో ఐదు హిట్స్ కొట్టి త్వరలోనే ‘నేను లోకల్’ అనే సినిమాతో మెప్పించేందుకు సిద్ధమవుతోన్న ఆయన, మరోపక్క తదుపరి చేయబోయే సినిమాలను కూడా ఇప్పట్నుంచే లైన్‌లో పెట్టేశారు. ఈ క్రమంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నారని కొద్దికాలంగా వినిపిస్తూనే ఉంది. ‘ఓ మై ఫ్రెండ్‌’తో పరిచయమైన వేణు శ్రీరామ్, రెండో సినిమాగా రవితేజతో ఒక సినిమా చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవడంతో వేణు, నానితో ఒక సినిమాకు రెడీ అయ్యారు.

కాగా రవితేజకు రాసిన కథే నానితోవేణు శ్రీరామ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. రవితేజ కోసం యాక్షన్ ఎంటర్‌టైనర్ కథని, నాని కోసం ఫ్యామిలీ డ్రామాని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నాని స్టైల్లో సాగే సాఫ్ట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట. ఫిబ్రవరి నెలలో సినిమా సెట్స్‌పైకి వెళుతుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 
Like us on Facebook