దీపావళికి రానున్న స్టార్ హీరో సినిమా

దీపావళికి రానున్న స్టార్ హీరో సినిమా

Published on Jan 19, 2018 12:08 PM IST

దక్షిణాది స్టార్ హీరోల్లో ఒకరైన తమిళ హీరో విజయ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజే పూజా కార్యక్రమాలతో మొదలుకానున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ సైతం ఈరోజే మొదలుకానుంది. రెండు రోజులపాటు ఈ షూట్ జరగనుంది. ఇదిలా ఉండగానే మురుగదాస్ తనదైన స్టైల్లో హ్యాపీ దీపావళి అని ట్వీట్ చేసి సినిమా దీపావళినాడు రిలీజవుతుందని ప్రకటించారు.

దీంతో విజయ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందివ్వనున్నారు. గతంలో విజయ, మురుగదాస్ కలిసి చేసిన ‘తుపాకి, కత్తి’ లాంటి సినిమాలు భారీ విజయాల్ని అందుకోవడంతో ఈ చిత్రంపై కూడా భారీస్థాయి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు