‘భరత్ అనే నేను’లో ప్రజా సమస్యలకి పరిష్కారం చూపాం : కొరటాల శివ

‘భరత్ అనే నేను’లో ప్రజా సమస్యలకి పరిష్కారం చూపాం : కొరటాల శివ

Published on Apr 19, 2018 12:25 PM IST

‘భరత్ అనే నేను’లో ప్రజా సమస్యలకి పరిష్కారం చూపాం : కొరటాల శివ
రేపు 20వ తేదీన ‘భరత్ అనే నేను’ సినిమా విడుదల సందర్బంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ, నిర్మాత దానయ్య, పాటలు రచయిత రామ్ జోగయ్య శాస్త్రిలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆ సంగతులు మీ కోసం..

రచయిత రామ జోగయ్య శాస్త్రి :

→’భరత్ అనే నేను’ సినిమాలోని పాటలకు గొప్ప స్పందన వస్తోంది. ఎంతో కష్టపడి లిరిక్స్ రాశాను. ముఖ్యంగా ‘వచ్చాడయ్యో సామి’ పాట చాలా బాగా రీచ్ అయింది. అన్నిటికన్నా మ్యూజిక్ సెన్స్ బాగా ఉన్న నిర్మాత అశ్విని దత్ గారు కనిపించగానే పొగడటం చాలా సంతోషాన్నిచ్చింది.
→కేవలం ఒక వర్గం ప్రేక్షకులని అని కాకుండా క్లాస్, మాస్ అందరినీ ఈ పాటలు ఆకట్టుకుంటాయి. దేవి శ్రీ ప్రసాద్ చేసిన ఎఫర్ట్ మర్చిపోలేనిది.

నిర్మాత దానయ్య :

→ ఈ ‘భరత్ అనే నేను’ తో గొప్ప సినిమా తీశానని గర్వపడుతున్నాను. ఇది మా బ్యానర్లోనే గొప్ప చిత్రమవుతుంది.

→ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకుగాను దర్శకుడు కొరటాల శివకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ నా కృతజ్ఞతలు.

దర్శకుడు కొరటాల శివ :

→ ఈ కథను చాలా ఏళ్ల క్రితమే రాసుకున్నాను. మహేష్ గారికి చెప్పగానే ఒప్పుకుని చేద్దాం అన్నారు.

→ అసలు దానయ్యగారికి ‘మిర్చి’ తర్వాతే సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. ‘జనతా గ్యారేజ్’ సమయంలో కూడ అడిగారు. ఈసారి తప్పకుండ చేస్తానని ఈ సినిమా చేశాను. పైగా మహేష్ బాబుతో సినిమా అనగానే ఆయన డబుల్ థ్రిల్ ఫీలయ్యారు.

→ మహేష్ తన నటనతో నేను రాసిన ప్రతి సన్నివేశాన్ని, మాటను తెరపై ఇంకా తీవ్రంగా కనబడేలా చేశారు.

→ ఇందులో సామాన్య ప్రజలు ఎదుర్కునే అన్ని సమస్యల్ని టచ్ చేశాను. అదే విధంగా వాటికి సొల్యూషన్స్ కూడ చెప్పాను. ఇందుకు చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది.

→ కథతో ఏ రాజకీయ నాయకుడు, పార్టీ రిలేట్ అవ్వకుండా చూసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్క కాంట్రవర్సీ కూడ లేకుండా సినిమా తీశాను.

→ దానయ్యగారు ఎప్పుడు కనిపించినా నాకు గౌరవం పెరిగే సినిమా, రిచ్ గా కనిపించే సినిమా కావలని పదే పదే అడిగేవారు. ఆయన కోరుకున్నట్టే సినిమా తీశాను. చిత్రం అందరినీ అలరిస్తుంది.

→ హీరోయిన్ కైరా అద్వానీ చాలా బాగా చేసింది. అందుకే దానయ్యగారు వెంటనే తన తర్వాతి సినిమాలో కూడ ఆమెను తీసుకున్నారు.

→ సినిమా కోసం పనిచేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా డివోపిలు తిర్రు, రవి కె చంద్రన్ లకు, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు, దేవి శ్రీ ప్రసాద్ అందరికీ నా కృతజ్ఞతలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు