అజిత్ ‘ఎంతవాడు గానీ..’ రిలీజెప్పుడు?

అజిత్ ‘ఎంతవాడు గానీ..’ రిలీజెప్పుడు?

Published on Apr 21, 2015 3:04 PM IST

ajith
తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఎన్నై అరిందాళ్’. గత ఫిబ్రవరి నెల్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ‘ఎంతవాడుగానీ..’ పేరుతో తెలుగులో విడుదల చేయాలని ఎప్పట్నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమా డబింగ్ కార్యక్రమాలు పూర్తైనా కూడా ఇప్పటికీ ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు.

పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అజిత్ ఓ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. ఈ సినిమాలో అజిత్ యాక్టింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇటు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో సూపర్ అనిపించుకున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా తెలుగు వర్షన్ విడుదలకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలిగిపోయినట్టు తెలుస్తోంది. మే నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు