నాగార్జున కోటీశ్వరుడు షోలో మూవీస్ ప్రమోట్ చేస్తాడా?

నాగార్జున కోటీశ్వరుడు షోలో మూవీస్ ప్రమోట్ చేస్తాడా?

Published on Apr 21, 2014 4:51 PM IST

First-Look-Nagarjuna-in-Mee
కింగ్ అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. తన శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మకి చాన్స్ ఇచ్చినప్పటి నుంచి త్వరలో రాబోతున్న ‘మనం’ వరకూ సరికొత్త పంథాని ఫాలో అవుతున్నారు. నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడనగానే అందరూ కాస్త సర్ప్రైజ్ అయ్యారు.

ఈ గేమ్ షో ‘కౌన్ బనేగా కరోట్పతి’ ద్వారా అన్ని భాషల్లో బాగా ప్రాచుర్యం పొందింది. మామూలుగా అన్ని భాషల్లోనూ ఈ షో లో సినిమా ప్రమోషన్స్ చేసేవారు, అలాగే సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చి ఆడేవారు, అలా వచ్చిన మనీని చారిటీకి డొనేట్ చేసేవారు. ఇదే ట్రెండ్ ని టాలీవుడ్ లో కూడా ఫాలో అవుతారా? అలా చేస్తే స్టార్స్ ఈ గేమ్ షో లో పాల్గొంటారు. అలాగే వారి సినిమాలని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు.

మామూలుగా ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున ఈ షో ద్వారా మూవీస్ ప్రమోట్ చేయడం మొదలు పెడితే సరికొత్త సినిమా ప్రమోషన్స్ కి నాంది పలికినట్లు అవుతుంది. ఇది బుల్లితెర ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి, అలాగే టాలీవుడ్ కి మంచి పరిణామం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు