ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో కీలక పాత్ర !

ఎన్టీఆర్ సినిమాలో యంగ్ హీరో కీలక పాత్ర !

Published on Apr 18, 2018 8:29 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచిన త్రివిక్రమ్ ఈసారి విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో మంచి కథ కథనాలను తయారుచేసుకుని ఈ సినిమా చేస్తున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం యంగ్ హీరో నవీన్ చంద్రను తీసుకున్నారట త్రివిక్రమ్. నవీన్ చంద్ర షూటింగ్లో కూడ పాల్గొంటున్నారట. ‘అందాల రాక్షసి’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన నవీన్ చంద్ర సోలో హీరోగా పలు సినిమా చేసి నాని యొక్క ‘నేను లోకల్’ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. ఈ పెర్ఫార్మెన్స్ చూసే మాటల మాంత్రికుడు ఈ హీరోకి తన సినిమాలో అవకాశమిచ్చారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు