సమీక్ష : బుడుగు – థ్రిల్స్ యావరేజ్, కాన్సెప్ట్ కేక.!

సమీక్ష : బుడుగు – థ్రిల్స్ యావరేజ్, కాన్సెప్ట్ కేక.!

Published on Apr 18, 2015 11:10 AM IST
Budugu

విడుదల తేదీ : 17 ఏప్రిల్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : మన్మోహన్

నిర్మాత : భాస్కర్, శ్రీనివాస్ సారిక

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : మంచు లక్ష్మి, శ్రీధర్ రావు, మాష్టర్ ప్రేం ప్రభు…


డా. మోహన్ బాబు ముద్దుల తనయురాలు మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘బుడుగు’. మాస్టర్ ప్రేమ్ బాబు కీ రోల్ చేసిన ఈ సినిమా ద్వారా మన్మోహన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఒక కురుంబ నేపధ్యలో జరిగే ఇబ్బందుల వల్ల పిల్లల మానసిక పరిస్థితులు ఎలా మారతాయి అనే పాయింట్ ఈ సినిమాలో చూపించారు. భాస్కర్, సారిక శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఆడియన్స్ ని ఏ మేరకు థ్రిల్ చేస్తుందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఉండాల్సిన వయసు కన్నా తక్కువ మానసిక ఎదుగుదల ఉన్న 10 ఏళ్ళ కుర్రాడి మనోవేదనే ఈ ‘బుడుగు’. ఇక కథలోకి వెళితే.. పూజ(లక్ష్మీ మంచు) – రాహుల్(శ్రీధర్ రావు) దంపతులకు ఇద్దరు పిల్లలు., వాళ్ళే బన్ని(మాస్టర్ ప్రేమ్ బాబు) మరియు విద్య (బేబీ డాలీ). రాహుల్ తన జాబు వల్ల పిల్లలతో సరిగా స్పెండ్ చెయ్యడు. ఈ గ్యాప్ వల్ల బన్ని సరిగా ఉండడం లేదని, అల్లరి ఎక్కువైందని రాహుల్ తనని తీసుకెళ్ళి బోర్డింగ్ స్కూల్ లో చేరుస్తాడు. కానీ అక్కడ బన్ని చేసిన కొన్ని సంఘటనల వలన స్కూల్ లో వాళ్ళందరూ భయపడి తనని అక్కడి నుంచి పంపేస్తారు.

అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాక బన్ని చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంటాడు. అర్ధ రాత్రిళ్ళు దెయ్యం వస్తోందని, అలాగే చనిపోయిన దియా తనకు కనపడుతోందని భయపడుతుంటాడు. ఒక రోజు పూజ కూడా ఇంట్లో ఇలాంటి సంఘటన ఎదుర్కోవాల్సి రావడంతో తెగ భయపడిపోతుంది. దాంతో పూజ బన్నిని చిల్డ్రన్స్ సైకాలజిస్ట్ గీత రెడ్డి(ఇంద్రజ) దగ్గరికి తీసుకెళ్తారు. ఆమె ఓ కౌన్సిలింగ్ చేసి ఓ సమస్యని చెబుతుంది. ఆ సమస్య వల్లే బన్ని అలా అయ్యాడని చెబుతుంది. అసలు బన్నికి ఉన్న సమస్య ఏమిటి.? అసలు తనెందుకు అలా బిహేవ్ చేస్తుంటాడు.? దియానే ఎందుకు బన్నికి కనపడుతుంది.? అసలు దియా ఎవరు.? బన్నికి దియాకి ఉన్న రిలేషన్ ఏంటి.? చివరికి బన్ని ఏమయ్యాడు.? అన్నది తెలియాలంటే బుడుగు చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

‘బుడుగు’ సినిమాలో నేటితరం తల్లి తండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, ఒకవేళ పిల్లలతో సరిగా లేకపోతే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు అనే పాయింట్ ని ఈ సినిమాలో బాగా చెప్పాడు. ఈ సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్ నటీనటుల ఎంపిక.. సినిమాలో ప్రతి పాత్రలోనూ తీసుకున్న నటీనటులు బాగా ఇమిడిపోయారు.

లక్ష్మీ మంచు ఇందులో ఓ భాద్యతాయుతమైన భార్య మరియు పిల్లలను ప్రేమించే తల్లి పాత్రలో కనిపించింది. మదర్ గా చక్కని హావ భావాలు పలికించి నటనలో మరో మెట్టు పైకి ఎక్కింది. ఇప్పటి వరకూ హర్రర్ సీన్స్ చెయ్యని లక్ష్మీ మంచు ఈ సినిమాలో సస్పెన్స్, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న సీన్స్ లో చాలా బాగా చేసింది. ఇక మాస్టర్ ప్రేమ్ బాబు సైకలాజికల్ గా వచ్చే ఇబ్బందులను చూపించే పిల్లాడి పాత్రలో ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడు. బేబీ డాలీ చూడటానికి క్యూట్ గా ఉండటమే కాకుండా మూగ పాత్రలో చాలా బాగా చేసింది. శ్రీధర్ రావు తన పాత్రకి న్యాయం చేసాడు. ఇంద్రజ డాక్టర్ పాత్రలో సినిమాలో చాలా కీ రోల్ చేసింది. ఈ పాత్రే సినిమాని ఓ మలుపు తిప్పుతుంది.

ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సినిమా మొదలైన 10 నిమిషాలు చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కాస్త ఆడియన్స్ లో సస్పెన్స్ ని రేకెత్తిస్తుంది. ఆ ఊపుతో సాగే సెకండాఫ్ ఆసక్తికరంగా మొదలవుతుంది. సెకండాఫ్ లో వచ్చే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా లక్ష్మీ మంచు – ప్రేమ్ బాబు – శ్రీధర్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని సరిగా చెప్పలకేపోవడం. డైరెక్టర్ అనుకున్న పాయింట్ మరియు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ బాగున్నా తీయడంలో, ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పడంలో కాస్త తడబడ్డాడు. ఇకపోతే ఫస్ట్ హాఫ్ మరో మేజర్ డ్రా బ్యాక్. ఫస్ట్ హాఫ్ లో మొదటి 5 నిమిషాలు, ఇంటర్వెల్ బ్లాక్ 5 నిమిషాలు తీసేస్తే మిగతా 50 నిమిషాలు చాలా బోరింగ్ గా సాగుతుంది. ఈ 50 నిమిషాలు జస్ట్ కాన్సెప్ట్ ని డెవలప్ చెయ్యడానికే తీసుకున్నాడు. చూసే వారికి అంత సాగదీయడం ఎందుకు అనే భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా థ్రిల్లింగ్ మోమెంట్స్ ఏమీ లేవు. రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ సినిమా చేస్తున్నాం అంటే దానికి ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడం కష్టమైన పని.. అందుకే చాలా ఎక్కువగా స్క్రిప్ట్ మీద వర్క్ చెయ్యాలి. కాన్సెప్ట్ బాగుంది కదా అని మిగతావి లైట్ తీసుకోకూడదు. ఓవరాల్ గా ఈ సినిమా చూసాక చాలా విషయాలు లైట్ తీసుకున్నారనే భావన కలుగుతుంది.

చెప్పాలంటే స్క్రీన్ ప్లే బాలేదు. థ్రిల్లర్ సినిమా అంటే స్క్రీన్ ప్లే చాలా టఫ్ గా చూసే ఆడియన్స్ సీటు అంచున కూర్చొని చూసేలా చెయ్యాలి.. కానీ అలాంటి సీన్స్ సినిమాలో రెండు మూడు తప్ప ఎక్కువ లేకపోవడం ఈ సినిమాకి మైనస్. జస్ట్ రాసుకున్న రెండు, మూడు థ్రిల్లింగ్ మోమెంట్స్ ని సెకండాఫ్ లోనే పెట్టేసారు. ఇకపోతే కలిమాక్స్ ని సరిగా రివీల్ చెయ్యలేకపోయాడు. కనీసం క్లైమాక్స్ అన్నా చాలా గ్రిప్పింగ్ గా చెప్పగలిగి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. ఎడిటింగ్ అస్సలు బాలేదని చెప్పాలి. సెకండాఫ్ లో జస్ట్ థ్రిల్స్ ఉన్నాయి, కానీ లాజికల్ పరంగా చాలా మిస్ అవుతుంటాం. ఈ సినిమాలో రెగ్యులర్ సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ లాంటివి ఏమీ ఉండవు. ఇలాంటి అంశాలు కోరుకొని వెళ్ళే ఆడియన్స్ కాస్త నిరుత్సాహపడతారు.

సాంకేతిక విభాగం :

బుడుగు సినిమాకి సురేష్ రగుటు అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉండడమే కాకుండా ఒక థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన ఎఫెక్ట్స్ ని ఎక్కడా మిస్ కాలేదు. సాయి కార్తీక్ మ్యూజిక్ చాలా బాగుంది. సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. సెకండాఫ్ లో సాయి కార్తీక్ మ్యూజిక్ ఆడియన్స్ ని సీట్లో కూర్చోబెడుతుంది. శ్యామ్ మెంగ ఎడిటింగ్ జస్ట్ ఓకే.. ఫస్ట్ హాఫ్ పరంగా ఇంకాస్త బెటర్ అం ఎడిటింగ్ ఉండాల్సింది. కొన్ని బోరింగ్ సీన్స్ ని కట్ చేసేసి ఉండాలి. రామ్ ఆర్ట్ డైరెక్షన్ సూపర్బ్.

ఇక ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అయిన కథ – కథనం – దర్శకత్వ విభాగాలను మన్మోహన్ డీల్ చేసాడు. మన్మోహన్ సినిమాని ఎలా తీసాడు అంటే కాన్సెప్ట్ బాగుంది కానీ సినిమా ఆడదేమో అన్నట్టు తీసారు. కథ – కాన్సెప్ట్ బాగుంది, కానీ కథా విస్తరణ ఆకట్టుకునేలా లేదు.. కథనం – సగం ఉడికిన అన్నంలా ఉంది.. ఎందుకంటే ఆయన రాసుకున్న మేజర్ సీన్స్ మీద తప్ప మిగతా దేనిమీద పెద్దగా ఆసక్తి చూపినట్టు లేదు. ఇక దర్శకత్వం – పెర్ఫార్మన్స్ లు బాగా చేయించాడు, కానీ ఆడియన్స్ ని ఆద్యంతం అలరించలేకపోయాడు. భాస్కర్, సారిక శ్రీనివాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని చేసిన ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘బుడుగు’ సినిమా తెలుగు ప్రేక్షకులను ఓ మేరకు మాత్రమే ఆకట్టుకోగలిగింది. ఎందుకు ఓ మేరకు మాత్రమే అంటే కాన్సెప్ట్ బాగుంది, కానీ కథా విస్తారణ సగం మాత్రమే ఆడియన్స్ ని సీట్లలో కూర్చో బెట్టగలిగింది. మంచు లక్ష్మీ, మాస్టర్ ప్రేమ్ బాబుల పెర్ఫార్మన్స్, కాన్సెప్ట్, సెకండాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ అయితే బోరింగ్ ఫస్ట్ హాఫ్, స్క్రీన్ ప్లే, లాజికల్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పలేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సినిమా చూడటానికి ట్రై చేయచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు