ఎప్పటికీ మీరే నా హీరో – సూపర్ స్టార్ మహేష్

ఎప్పటికీ మీరే నా హీరో – సూపర్ స్టార్ మహేష్

Published on May 31, 2026 1:01 PM IST

నేడు సూపర్ స్టార్ దివంగత కృష్ణ జయంతి. కాగా తన తండ్రి జయంతి సందర్భంగా మహేశ్‌బాబు ఓ ఎమోషనల్‌ పోస్టు షేర్ చేశారు. ‘ఎప్పటికీ మీరే నా హీరో. హ్యాపీ బర్త్‌ డే నాన్నా’ అంటూ తండ్రిపై తనకున్న ప్రేమను మహేశ్ బాబు వ్యక్తం చేశారు. మహేశ్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్‌ కూడా కృష్ణను స్మరించుకున్నారు. ఎప్పుడూ ప్రేమతో మిమ్మల్ని తలచుకుంటూనే ఉంటామంటూ ఆమె పోస్టు చేశారు. సూపర్ స్టార్ అభిమానులు సైతం ఆయన జయంతి నాడు.. ఆయన చేసిన సినిమాల గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటున్నారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణను స్మరించుకుంటూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్‌ చేశారు. ‘‘తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా విశిష్ట సేవలందించిన పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నా. నూతన సాంకేతికతలను పరిచయం చేస్తూ సినీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానటుడికి ఘన నివాళులు’’ అని చంద్రబాబు పోస్ట్ పెట్టారు.

తాజా వార్తలు