‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ అదే !

‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ అదే !

Published on May 31, 2026 12:00 PM IST

Srinivasa-Mangapuram

దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. కాగా సూపర్‌ స్టార్ కృష్ణ 84వ జయంతి సందర్భంగా, ఈ చిత్రం 2026 జూలై 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి మహేష్ బాబు సలహాలు, సూచనలు ఉన్నాయని.. మహేష్ ఫీడ్ బ్యాక్ తమకు ఎంతగానో ఉపయోగ పడిందని జయకృష్ణ చెప్పుకొచ్చాడు.

కాగా అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. కాగా తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథా నేపథ్యం సాగుతుందని.. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు