సమీక్ష : చాణక్యుడు – ఫలించని వ్యూహం

సమీక్ష : చాణక్యుడు – ఫలించని వ్యూహం

Published on Nov 30, 2012 2:05 PM IST
విడుదల తేదీ: 30 నవంబర్ 2012
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు :గొట్టెగంటి శ్రీనివాస్
నిర్మాత : టి. సంతోష్, గొట్టెగంటి రామచంద్ర, నందన్ రెడ్డి
సంగీతం : రాహుల్ – వెంగి
నటీనటులు : తనీష్, ఇషితా దత్తా


బాల నటుడి నుండి హీరోగా మారిన వారిలో తనీష్ ఒకడు. నచ్చావులే, రైడ్ సినిమాలు బాగానే ఉన్నా ఏం పిల్లో ఏం పిల్లాడో, కోడిపుంజు అంటూ నిరాశ పరిచాడు. చివరగా వచ్చిన మేం వయసుకు వచ్చాం బావుంది. తనీష్ లేటెస్ట్ మూవీ ‘చాణక్యుడు’ ఈ రోజే విడుదలైంది. తనీష్, ఇషిత దత్త జంటగా నటించిన ఈ సినిమా గురించి రెగ్యులర్ సినీ ప్రేమికులకి కూడా సరైన సమాచారం తెలియదు. విడుదలయింది కూడా చాలా తక్కువ థియేటర్లలోనే. గొట్టిగింటి శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సంతోష్, రామచంద్ర, నందన్ రెడ్డి నిర్మాతలు. ఇంతకు ఈ చాణక్యుడు ఏం చూసాడో ఇప్పుడు చూద్దాం.

కథ :

స్వప్న (ఇషిత దత్త) తల్లితండ్రుల్ని ఆస్తి కోసం సొంత మేన మామ కొడుకులే (?) చంపడంతో బంధువులకి దూరంగా ఉంటూ పెరుగుతుంది. ఉమ్మడి కుటుంబలో ఉండే ఎవరినైనా (?) పెళ్లి చేసుకుంటానంటూ పెళ్లి కొడుకు కోసం వెతుకుతుంటుంది. ఆమె అన్వేషణ ఫలించి చాణక్య (తనీష్) దొరుకుతాడు. చాణక్యకి ఇష్టం లేకపోయినా స్వప్న వెంట పడుతూ ఉంటుంది. ఆస్తి తగాదా విషయంలో ఒకరిని చంపుతుండగా చాణక్య అన్న (జాకీ) ఫోటోలు తీస్తాడు. ఆ హత్య చేసిన వారు (?) వెతుక్కుంటూ వచ్చి చాణక్య అన్నతో పాటు ఆ కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు. చాణక్య కుటుంబాన్ని చంపింది ఎవరు. వారికీ స్వప్నకి సంబంధం ఏమిటి? చాణక్య వారి మీద పగ తీర్చుకోవడానికి స్వప్న ఎందుకు/ఎలా సహాయం చేసింది? అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

తనీష్ ప్రేమ సన్నివేశాల కంటే యాక్షన్ సన్నివేశాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసిపోతుంది. యాక్షన్ సన్నివేశాల మీద బాగానే కేర్ తీసుకున్నాడు. ఒక ఫైట్ కూడా బాగానే చేసాడు. ఇషిత దత్త నటన పరంగా ఏమీ చేయలేదు కానీ నవ్వినపుడు మాత్రం బావుంది. నా చెలియ నవ్వు, నా శ్వాసల్లోన పాటలు బానే ఉన్నాయి. చిత్రీకరణ కూడా పర్వాలేదు. ఇంతకు మించి ఈ విభాగంలో మాట్లాడుకోవడానికి ఏమీ లేవు.

మైనస్ పాయింట్స్ :

ఒక పని మొదలు పెట్టినపుడు మంచైనా చెడైనా ఆ పని ఆసక్తితో చేస్తే చేసిన పనికి ఫలితం ఉంటుంది. దీనికి ఉదాహరణ హీరోనే. సినిమాలో ఎక్కువగా ఉన్న ప్రేమ సన్నివేశాలు తనకు ఇష్టం లేకుండా తీస్తున్నట్లు అసహనంగా కదిలాడు తనీష్. యాక్షన్ సన్నివేశాలు బాగానే చేసాడు కానీ సినిమా మొత్తం మీద ఉన్నది ఒక్కటే యాక్షన్ ఎపిసోడ్. తనీష్ బాడీ మీద కేర్ తీసుకుంటే బావుంటుంది. విలన్స్ ఐదుగురు ఉన్నారు. ఒక్కరికి కూడా ప్రాధాన్యత లేదు. ఒకవేళ ప్రాధాన్యత ఇచ్చినా మేము ఇంతే చేస్తాము అన్నట్లు చేసారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే పురాణ కాలం నుండి వస్తున్న స్టొరీ లైన్ ఎత్తుకున్నాడు. పోనీ స్క్రీన్ ప్లే అయినా బావుందా అంటే కథ ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుందా? ప్రెసెంట్ మోడ్ లో నడుస్తుందా అనే అనుమానం చాలాసార్లు వస్తుంది. కనీసం క్లైమాక్స్ లో అయినా క్లారిటీ ఇచ్చాడు సంతోషం. స్వప్న కళ్ళ ముందే ఆమె బావని చంపితే ఆమెని కనీసం ఎంక్వయిరీ కూడా చేయరు. మర్డర్స్ మిస్టరీ చేదించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తున్నాడు అని ఒక సన్నివేశంలో చెప్పించారు. ఆ సన్నివేశం తరువాత మూడు మర్డర్లు జరిగాయి కానీ ఒక్క పోలీసు కూడా కనపడలేదు. చెప్పడానికి ఓపిక లేననంతగా ఇలాంటి సిల్లీ పాయింట్స్ చాలా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

పైన చెప్పుకున్నట్లు రాహుల్ – వెంగి అందించిన సంగీతంలో నా చెలియ నవ్వు, నా శ్వాసల్లోన పాటలు బాగానే ఉన్నాయి. నేపధ్య సంగీతం కొంతలో కొంత పర్వాలేదు. సినిమాటోగ్రఫీ అస్సలు బాలేదు. కనీసం డిఐ కూడా చేయించలేదు. ఎడిటింగ్ అంతా గంధరగోలమే. ఇంకా

తీర్పు :

ఈ సినిమా విడుధలైనట్లు కూడా తెలియకూడదన్నట్లు చాలా తక్కువ థియేటర్లలో విడుదలైంది. థియేటర్ వరకు వెళ్లి చూసేంత విషయం సినిమాలో ఏమీ లేదు. కనీసం టెక్నికల్ గా కూడా బాలేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

అశోక్ రెడ్డి .ఎమ్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు