ఇప్పుడు ఒక్క సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మంచి ఆదరణ ఉన్న సంగీత దర్శకుల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు అనిరుద్ కూడా ఒకరు. ఏ ఇండస్ట్రీకి వెళ్లినా కూడా తన మ్యూజిక్ తో ఆడియెన్స్ ని తాను ఊపేస్తాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన ది ప్యారడైజ్ (The Paradise) ఫస్ట్ సింగిల్ తో మరోసారి దుమ్ము లేపుతున్నాడు. అయితే ఓ ఇంట్రెస్టింగ్ అంశం తన లేటెస్ట్ వర్క్స్ లో కనిపిస్తుంది అని చెప్పాలి.
ఇప్పుడు ఏదైతే ఫస్ట్ సింగిల్ లో బీట్స్ తో ఆడియెన్స్ ఓ రేంజ్ లో ట్రాన్స్ లోకి వెళ్లిపోతున్నారో ఇదే మ్యాజిక్ ని గతంలో తాను మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’కి కూడా చేసాడు. దేవర చిత్రం అనౌన్సమెంట్ వీడియో ఒకటి వచ్చింది గుర్తుందా? అందులో అనిరుద్ స్కోర్ తో ఆడియెన్స్ కి మెంటలెక్కించాడు.
కట్ చేస్తే అదే మ్యూజిక్ తో వదిలిన దేవర (Devara) సాంగ్ కి మాస్ రెస్పాన్స్ సినిమాలో వచ్చింది. ఇప్పుడు కూడా ది ప్యారడైజ్ (The Paradise) అనౌన్సమెంట్ వీడియోలో ఇచ్చిన స్కోర్ తోనే వచ్చిన ఫస్ట్ సింగిల్ కి కూడా అదే తరహా రెస్పాన్స్ వస్తుంది. దీనితో అనిరుద్ మాత్రం చేసిన మ్యూజిక్ మ్యాజిక్ తెలుగు ఆడియెన్స్ లో అలా ఇంజెక్ట్ అవుతూ వెళుతుంది అని చెప్పొచ్చు.


