సమీక్ష: లావణ్య విత్ లవ్ బాయ్స్ – కాస్తా దూరంగా ఉంటే బెటర్

సమీక్ష: లావణ్య విత్ లవ్ బాయ్స్ – కాస్తా దూరంగా ఉంటే బెటర్

Published on Oct 6, 2017 12:53 PM IST
lavanya with love boy movie review

విడుదల తేదీ : అక్టోబర్ 6, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

దర్శకత్వం : వడ్డేపల్లి కృష్ణ

నిర్మాత : రాజ్యలక్ష్మి సి. నర్సింలు పటేల్ చెట్టి

సంగీతం : యశో కృష్ణ

నటీనటులు : పావని, యోద పటిల్, సాంబ, రవి కిరణ్, హేమ సుందర్

ఈ మధ్య కాలంలో తెలుగులో వస్తున్న చిన్న సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్ తో మంచి కథాంశంతో తీస్తున్న సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్తున్నాయి. ఆ కోవలో వచ్చిన మరో చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్.. మరి ఈ సినిమా ఎలా ఉందో కాస్తా తెలుసుకుందాం.

కథ :

యోద, సాంబ, హేమ సుందర్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్, కాలేజీ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, జీవితంలో ప్రేమ గురించి కలలు కంటూ ఉంటారు. వారి కాలేజీ లో తెలుగు అధ్యాపకులు(పరుచూరి గోపాలకృష్ణ) చెప్పిన మను చరిత్ర కథతో స్ఫూర్తి పొంది వరూధిని లాంటి అమ్మాయి కావాలని అనుకునే టైంలో నర్స్ గా పని చేస్తున్న లావణ్య(పావని)ని చూసి ప్రేమలో పడతారు. ముగ్గురు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి ప్రేమని పొందాలని అనుకుంటారు. మరి లావణ్య ఆ ముగ్గురులో ఎవరిని ప్రేమిస్తుంది? లావణ్యకి కష్ట కాలంలో ఆ ముగ్గురు ఎలా సపోర్ట్ గా నిలబట్టారు అనేది సినిమా కథ

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే ఒకే అమ్మాయిని ముగ్గురు యువకులు ప్రేమించడం అనే కథ మూలం. ఇలాంటి పాయింట్స్ ఇది వరకు చాలా వచ్చిన ఆ లైన్ మీద మంచి స్క్రీన్ ప్లే తో అద్బుతమైన సినిమా చూపించొచ్చు.

ఇందులో సీనియర్ నటుడు రచయిత పరుచూరి గోపాల కృష్ణ నటించారు. ఆయన పాత్ర పరిధి మేరకు భాగానే మెప్పించారు. టైటిల్ పాత్ర చేసిన పావని కూడా పర్వాలేదనిపించుకుంది. హీరోలుగా చేసిన ముగ్గురు కుర్రాళ్ళు వాళ్ళ సామర్ధ్యం మేరకు మెప్పించే ప్రయత్నం చేసారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే మొదటి నుంచి చివరి వరకు చాలా చెప్పుకోవాలి. అరిగిపోయిన ఒక పాత చింతకాయ పచ్చడి లాంటి కథని తీసుకొని దాని నుంచి స్క్రీన్ ప్లేని దర్శకుడు అల్లుకున్నాడు. అయితే కథని నడిపించే భాగంగా ఆయన రాసుకున్న సన్నివేశాలు ఎ ఒక్కటి మెప్పించదు. సినిమాలో విషయం లేనపుడు ఇక నటీనటులు చేయగలిగేది ఏమీ ఉండదు. పరుచూరి గోపాలకృష్ణ, హేమ సుందర్ లాంటి సీనియర్ నటులని పెట్టుకున్న వాళ్ళని సరిగా వినియోగించుకోలేదు. ఇలా చెప్పుకునే పోతే సినిమాలో చాలా లోపాలు ఉంటాయి.

సాంకేతిక విభాగం :

రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ నిర్మాణ విలువలు పర్వాలేదు. సినిమా దర్శకుడుగా వడ్డేపల్లి కృష్ణ ఏదో ప్రయత్నం చేసిన కనీసం మెప్పించాలేకపోయారు. ఇక సినిమా పాటలలో సాహిత్యం కొంత వరకు పర్వాలేదనే విధంగా ఉన్న. యశో కృష్ణ సంగీతం ప్రెజెంట్ యూత్ ట్రెండ్ కి చాలా దూరంగా ఉంది. పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆయన తన ప్రయత్నం భాగానే చేసిన ఈ జెనరేషన్ ని మాత్రం కనెక్ట్ చేయలేకపోయారు. ఇక కెమెరా పనితం ఒకే అనిపించుకుంటుంది. ఇక ఇలాంటి సినిమాలో ఇక ఎడిటర్ గొప్పగా చేయాడానికి ఏమీ ఉండదు.

తీర్పు :

ఈ మధ్య కాలంలో వస్తున్నా అన్ని లో బడ్జెట్ సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా ఎ రకంగా మెప్పించలేకపోయింది. ఆర్టిస్ట్ లు వాళ్ళ పాత్ర పరిధి మేరకు ఎదో చేయడానికి ట్రై చేసారు. దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పే ప్రయత్నం చేసారు. అయితే ట్రెండ్ కి దూరంగా వెళ్ళడం సినిమా ఎ ఒక్కరిని మెప్పించలేకపోయింది. ఓవరాల్ గా ఈ సినిమా కోసం మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఉండటం బెటర్.

123telugu.com Rating : 1.5/5
Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం

తాజా వార్తలు