మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఊహించని సక్సెస్ అందుకొని బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. అయితే ఈ చిత్రం అందుకున్న సక్సెస్ మాత్రం ఒక్క ఆన్లైన్ లో భారీ బుకింగ్స్ తోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా కనిపిస్తుంది.
లేటెస్ట్ గా తెలంగాణాలో ఓ అరుదైన సంఘటన జరిగింది. ముక్తల్ ప్రాంతంలో వెంకట రమణ అనే సింగిల్ స్క్రీన్ లో ఇరుముడి సినిమా విజయవంతంగా ప్రదర్శన జరుగుతుంది. దీనితో టికెట్స్ కూడా దొరక్కుండా చాలామంది ఇంటికి తిరిగి వెళ్ళిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయట.
కానీ ఈ బుధవారం నుంచి ఇరుముడి సినిమాని తీసి మరో సినిమా యాడ్ చేయడంతో ఆ సినిమానే ఉందనుకొని థియేటర్ వద్దకి వచ్చిన జనం అంతా ఇరుముడి షో వెయ్యాల్సిందే అని బైఠాయించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో ఇరుముడి సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు.


