సమీక్ష : లవ్ సైకిల్ – నిరాశపరిచిన బ్రేకుల్లేని సైకిల్

సమీక్ష : లవ్ సైకిల్ – నిరాశపరిచిన బ్రేకుల్లేని సైకిల్

Published on May 18, 2013 4:30 AM IST
Love_Cycle విడుదల తేదీ : 17 మే 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : సపన్ కుమార్
నిర్మాత : రానా
సంగీతం : ‘ అగస్త్య
నటీనటులు : శ్రీ, రేష్మ…


‘ఈ రోజుల్లో’ ఫేం హిట్ పెయిర్ శ్రీ, రేష్మ జంటగా నటించిన సినిమా ‘లవ్ సైకిల్’. ఈ సినిమాకి ‘బెల్లు బ్రేకుల్లేవ్’ అనేది ఉపశీర్షిక. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి సపన్ కుమార్ దర్శకత్వం వహించగా, రానా నిర్మించాడు. అగస్త్య సంగీతం అందించిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయినా సరైన సమయం దొరక్క రిలీజ్ కాస్త ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో శ్రీ, రేష్మ మరోసారి ‘ఈ రోజుల్లో’ మేజిక్ ని రిపీట్ చేసారో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

శరణ్య(రేష్మ) ఫ్యాషన్ మాగజైన్ లో పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు తన ఎం డి ఝాన్సీ తో ఒక అమ్మాయి ఇష్టపడే బాయ్ ఫ్రెండ్ తనకి కరెక్ట్ కాదని తెలిసాక అతని నుంచి ఏ ప్రమాదం జరక్కుండా ఎలా వదిలించుకోవాలనే దానిమీద ఒక ఆర్టికల్ రాస్తానంటుంది. దానికి ఝాన్సీ అది సాధ్యం కాదని చెబుతుంది, కావాలంటే నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసి అతని నుంచి నీకు ఎ హాని జరుగ కుండా వదిలించుకొని చూపిస్తే అదే ఉదాహరణగా చెప్పి ఆర్టికల్ ప్రచురిస్తానని చెబుతుంది. అందులో భాగంగానే గౌతం(శ్రీ) ని సెలెక్ట్ చేసుకుంటుంది.

కట్ చేస్తే గౌతం ఒక యాడ్ ఏజన్సీలో పని చేస్తూ లవ్వు గివ్వూ ఏమీ లేవంటూ అమ్మాయిలతో ఎంజాయ్ చేసే ప్లే బాయ్. వాళ్ళ కంపెనీకి ఇంటర్నేషనల్ జ్యువెలరీ బ్రాండ్ కి ఒక సంవత్సరం యాడ్స్ చేసే ఆఫర్ వస్తుంది. గౌతం ఎన్ని రోజుల నుంచో కంటున్నా కల నెరవేరింది అనుకుంటే టైములో ఆ కంపెనీ ఎండి చాన్స్ గౌతంకి ఇవ్వకుండా స్నేహకి ఇస్తాడు. స్నేహ తను ఆయాద్ చాన్స్ వదులుకోవాలంటే ఒక అమ్మాయిని నెల రోజుల్లో పడగొట్టి ఐ లవ్ యు చెప్పించుకుంటే తను తప్పుకుంటానని చెబుతుంది. అలా గౌతం శరణ్యని ఎంచుకుంటాడు. ఇలా గౌతం, శరణ్య ఒకరి స్వలాభం కోసం ఒకరు కలుసుకుంటారు. అలా కలుసుకున్న వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు జరిగాయి? చివరి వరకూ వారిద్దరూ తమ లక్ష్యం కోసమే కలుసున్నారా? లేక నిజమైన ప్రేమికులుగా మారారా? ఒకరికి తెలియకుండా ఒకరు వేసిన బెట్టింగ్స్ లో చివరికి ఎవరు గెలిచారు? అనేది మిగిలిన కథాంశం.
ప్లస్ పాయింట్స్ :

కామెడీ సన్నివేశాల్లో శ్రీ నటన బాగుంది. మిగతా సన్నివేశాల్లో అతని నటన చెప్పుకునే రేంజ్ లో లేదు. డాన్సుల విషయంలో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. జూనియర్ త్రిష అని పిలిచే రేష్మ నటన కూడా ఓకే అనేలా ఉంది. ఒక పాటలో కాస్త హాట్ గా కనిపించి ముందు బెంచి వారిని బాగానే ఆకట్టుకుంది. సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కామెడీ ఎపిసోడ్, క్లైమాక్స్ కామెడీ ఎపిసోడ్ బాగా నవ్విస్తాయి, అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

హీరో తాతగారి పాత్రలో ఎల్ బి శ్రీరాం నటన బాగుంది. అలాగే ఈ సినిమాలో కమెడియన్స్ గా చేసిన చంటి తదితరులు కొంతవరకూ నవ్వించడానికి ప్రయత్నించారు. అన్ని సినిమాల్లో లాగానే కొన్ని వర్గాల ప్రేక్షకులని ఆకర్షించే డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టి నవ్వించడానికి ప్రయత్నించారు. చివర్లో స్క్రీన్ పైకి పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ కటౌట్ తీసుకురావడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

మైనస్ పాయింట్స్ :

‘ఈ రోజుల్లో’ సినిమా హిట్ అవ్వడం వల్ల అదే కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పై కాస్తైనా అంచనాలుంటాయి. కానీ ఈ సినిమా ఆ అంచనాలను కూడా అందుకోలేకపోయింది. ఎంచుకున్న స్టొరీ లైన్ పరవాలేదనిపించినా టేకింగ్ మాత్రం చాలా చెత్తగా ఉంది. మొదటి పదిహేను నిమిషాల్లోనే సినిమాలో ఎం చెప్పాలి అనుకున్నది చెప్పేయడంతో కామన్ గా ప్రేక్షకులు ఇకముందు సినిమా ఇలా ఉండనుందని ఒక అంచనాకి వచ్చేస్తారు. డైరెక్టర్ ప్రేక్షకులు ఊహించుకున్నది ఊహించనట్టు తీయకపోతే వారు ఫీలవుతాడనుకున్నాడో ఏమో గానీ మనం సీన్ టు సీన్ గెస్ చేసేటట్టే సినిమాని తీసాడు.

ఈ మధ్య కాలంలో సినిమా అంటే అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఎక్కువ భాగం ఒక టైటిల్ సాంగ్, ఒక ఐటెం సాంగ్ ఉండాలని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా డైరెక్టర్ కూడా అదే ఫార్మాట్ ని ఫాలో అయ్యి ఓ ఐటెం సాంగ్ ని పెట్టాడు. ఐటెం సాంగ్ పెట్టడంలో తప్పులేదు సమయం సందర్భం లేకుండా పెట్టి ప్రేక్షకుల్ని ఎందుకు ఇబ్బంది కూడదనేది నా అభిప్రాయం. ఉదాహరణకి ఈ సినిమాలో హీరో తన ముసలి తాత గారి పుట్టిన రోజుకి ఐటెం గర్ల్ ని పెట్టి గాన బజానా చేయించడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకపోగా, అంతకముందు క్రియేట్ చేసిన ఫ్యామిలీ సెంటిమెంట్ ఫీల్ కాస్తా గంగలో కలిసిపోతుంది.

ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటి నుంచి సినిమా నిదానంగా సాగుతుంది, ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగానే ఉన్నా సెకండాఫ్ ని అదే ఫీల్ తో కొనసాగించలేకపోయాడు. సినిమా మొదటి నుంచి నిదానంగా సాగుతున్న సమయంలో పాటలు వచ్చి ప్రేక్షకులకి చిరాకు పెడతాయి. అలాగే శ్రీ – రేష్మ మధ్య పెట్టిన రొమాటిక్ ట్రాక్ మరియు టార్చర్ ట్రాక్ ఏదీ ఆకట్టుకునేలా లేదు. డైరెక్టర్ కి అంతగా అనుభవం లేకపోవడం వల్ల నటీనటుల నటన చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ అంతంత మాత్రంగా ఉంది. కనీసం ఎడిటర్ అన్నా జాగ్రత్తలు తీసుకొని చాలా బోరింగ్ గా, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్న సన్నివేశాలను కత్తిరించి పారేయాల్సింది, వాటితో పాటు ఒక రెండు పాటల్ని కూడా లేపేసి ప్రేక్షకులకి కాస్తైనా విముక్తి కలిగించాల్సింది. అగస్త్య అందించిన పాటల్లో క్లైమాక్స్ సాంగ్ తప్ప మిగతా ఏ పాటలు సినిమాకి హెల్ప్ అవ్వలేదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరవాలదనిపిస్తుంది. డైలాగ్స్ ఓకే.

సినిమా కోసం డైరెక్టర్ ఎంచుకున్న కథ పరవాలేదనిపిస్తుంది. కానీ డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ కి పూర్తి న్యాయం చెయ్యలేకపోయాడు. వీక్ స్క్రీన్ ప్లే, పర్ఫెక్షన్ లేని డైరెక్షన్ తో అనుకున్న కాన్సెప్ట్ ని పరమ రొటీన్ గా తీసి సినిమాని చెడగొట్టాడు. నిర్మాణ విలువలు ఓకే.

తీర్పు :

‘ఈ రోజుల్లో’ ఫేం తో సక్సెస్ అయిన శ్రీ – రేష్మ కాంబినేషన్ ‘లవ్ సైకిల్’ తో పెద్ద ఫ్లాప్ అయ్యింది. రెండు మూడు కామెడీ ఎపిసోడ్స్, ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్, నాలుగు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తప్ప పాజిటివ్ గా చెప్పుకోవటానికి ఏమీ లేవు. వీక్ స్క్రీన్ ప్లే, అంతకన్నా చెత్తగా అనిపించే డైరెక్షన్, అనవసరమైన పాటలు సినిమాకి పెద్ద మైనస్. లవ్ సైకిల్ – బెల్లు బ్రేకుల్లేవ్ అని టైటిల్ లో చెప్పింది నిజమే ఒకవేళ సైకిల్ కి బ్రేకులు బెల్లు ఉండుంటే అన్నా కొద్ది రజులు థియేటర్స్ లో ఉండేదేమో కానీ బెల్లు బ్రేకులు లేకపోవడం వల్ల థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఉండడం చాలా కష్టమనే చెప్పుకోవాలి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు