సమీక్ష : మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో – ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టే బ్యూరో..!

సమీక్ష : మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో – ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టే బ్యూరో..!

Published on Feb 8, 2014 4:00 AM IST
MMB విడుదల తేదీ : 07 ఫిబ్రవరి 2014
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : ఉదయరాజ్. ఎ
నిర్మాత : మల్లెల సీతారామరాజు – స్వాతి పిల్లాడి
సంగీతం : రఘురాం
నటీనటులు : శ్రీకాంత్, మనో చిత్ర … 




ఫ్యామిలీ హీరోగా ముద్రపడిన శ్రీ కాంత్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే ఓ సినిమా రొఇలీజ్ చేసిన శ్రీ కాంత్ ఈ రోజు మరో సినిమాని రిలీజ్ చేసాడు. అదే ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’. ‘వన్ ఇయర్ మాత్రమే గ్యారంటీ’ అనేది ఉపశీర్షిక. శ్రీ కాంత్, మనో చిత్ర జంటగా నటించిన ఈ సినిమాకి ఉదయరాజ్ డైరెక్టర్. మల్లెల సీతారామరాజు – స్వాతి పిల్లాడి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి రఘురాం సంగీతం అందించాడు. ఈ సినిమాతో అన్నా శ్రీ కాంత్ హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న మల్లి(శ్రీకాంత్) చుట్టూ తిరుగుతుంది ఈ కథ, డబ్బులిస్తే ఎలాంటి వారికయినా పెళ్లి చేసేయగల సమర్ధుడు. ఇన్స్యురెన్స్ ఏజెంట్ గా పని చేసే మనో చిత్రకూ అసలు పెళ్ళంటే ఇష్టం ఉండదు మనో చిత్ర తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మనో చిత్రను పెళ్ళికి ఒప్పించాలని అనుకుంటాడు. అదే సమయంలో ప్రేమలో విఫలమయిన బాబి(వెన్నెల కిషోర్) ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అతన్ని కాపాడిన మల్లి అతని ప్రేమను ఎలాగయినా గెలిపిస్తా అని మాటిస్తాడు. అనుకున్నట్టుగానే బాబి ప్రేమని గెలిపించి పెళ్లి చేస్తాడు. మనో చిత్రకి పెళ్లి కుదిర్చినా అది ఆగిపోతుంది. అక్కడ నుండి మల్లిగాడు పడే కష్టాలు.. అసలు మనో చిత్ర పెళ్లి ఎందుకు ఆగిపోయింది ? ఆ ఆ తర్వాత మల్లి ఎవరితో మనో చిత్ర పెళ్ళి చేసాడు? దానికోసం మల్లి ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది మిగిలిన కథ..

ప్లస్ పాయింట్స్ :

శ్రీ కాంత్ నటన ఎప్పటిలానే ఉంది. తన పాత్రకి కావలసింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొత్తగా అంటూ ఏమీ లేదు. మనోచిత్ర చూడటానికి అందంగా ఉంది, అలాగే కాస్త మెరుగైన నటనని కనబరిచి ఉంటె బాగుండేది. వెన్నెల కిషోర్ అక్కడక్కడా బాగానే నవ్వించాడు. శిరీష నటనలో సీరియల్ ఛాయలు చాలా కనిపించాయి. బ్రహ్మానందం నటన అన్ని చిత్రాలలానే ఇందులో ఉంది. కొన్ని సన్నివేశాలలో బాగా నవ్వించినా మొన్ని చోటల్ మాత్రం నవ్వించలేకపోయాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ రన్ టైం. సుమారు 2 గంటల 50 నిమిషాలు. ఈ సినిమా కోసం డైరెక్టర్ ఎంచుకున్న కథని మన తెలుగు ప్రేక్షకులు చాలా సార్లు చూసేసారు. పాత చితంకాయ పచ్చడి లాంటి స్టొరీని ఎంచుకున్న డైరెక్టర్ కొత్తగా చూపించే ప్రయత్నం కాస్తైనా చేయకుండా ఇంకా చెత్తగా చూపించాడు. స్క్రీన్ ప్లే సినిమా చూస్తున్న ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించకపోగా మరింత ఊహాజనితంగా తయారుచేసింది. ఎంతలా అంటే సినిమా మొదటి 10 నిమిషాలు చూసాక డైరెక్టర్ ఇంటర్వల్ బ్లాక్ ఎక్కడ వేస్తాడు, క్లైమాక్స్ లో ఎలాంటి సీన్స్ ఉంటాయి, శుభం కార్డ్ ఎలా పడుద్ది అనేది కూడా ఊహించేంతలా సినిమా ఉందటే స్క్రీన్ ప్లే ఏ రేంజ్ లో రాసారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంత వీక్ స్రీన్ ప్లే ఉన్న సినిమా సుమారు మూడు గంటలు ఉంటే ప్రేక్షకులు భరించలేరు.

ఈ మధ్య వస్తున్న డబుల్ మీనింగ్ కామెడీనే ఈ సినిమాలో కూడా పెట్టడానికి డైరెక్టర్ బాగా ట్రై చేసాడు. కానీ అన్ని చోట్లా సక్సెస్ కాలేకపోయాడు. పోసాని, జయప్రకాష్ నారాయణ, తెలంగాణ శకుంతల, కాశీ విశ్వనాథ్ లాంటి సీనియర్ కమెడియన్స్ ని పెట్టుకొని కూడా కామెడీ సరిగా పండించలేకపోయాడు. దానికి తోడు వారికి పాత్రలకు కూడా పెద్ద ప్రాధాన్యత లేదు. ఈ సినిమా అఫిర్స్త్ హాఫ్ చాలా స్లోగా ఉందనుకుంటే సెకండాఫ్ దానికన్నా స్లోగా ఉంటుంది. దానికి తోడు మధ్య మధ్యలో పాటలు వచ్చి మన సహనాన్ని పరీక్షిస్తుంటాయి.

సాంకేతిక విభాగం :

రఘురాం అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతంతమాత్రంగానే ఉంది. ఎడిటర్ కి ఏమి కట్ చేయాలో తెలియక తీసిన ప్రతి సీన్ ని సినిమాలో పెట్టేయడం వల్ల సినిమా నిడివి పెరిగింది, దానివల్ల ఆడియన్స్ సహన పరీక్షకి గురయ్యారు. డైలాగ్స్ లో అర్థం ఉన్నవి మనకు పెద్దగా వినిపించవు, కానీ అర్థం పర్ధం లేనివి, ద్వందార్థాలు వచ్చే డైలాగ్స్ చాలానే ఉంటాయి.

ఈ సినిమా కోసం ఎందుకున్న కథని మనం ఎప్పుడో చూసేసాం కావున ఇందులో మీరు చూడటానికి చూసి ఎంటర్ టైన్ అవ్వడానికి ఏమీ ఉండదు. స్క్రీన్ ప్లే అస్సలు బాలేదు. ఇక దర్శకత్వం అంటారా.. అతనికి టాలెంట్ ఉంది ఉంటే సినిమాలో అది బాలేదు, ఇది బాలేదు అనే చెప్పేవాళ్ళం కాదుగా. కావున ఉదయ రాజ్ డైరెక్టర్ గా కూడా ఫెయిల్ అయ్యాడు.

తీర్పు :

శ్రీ కాంత్ నటించిన ఈ ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ సినిమా థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకుల సహనానికి పరీక్ష అయ్యింది. ఒకటి రెండు కామెడీ సీన్స్, శ్రీ కాంత్ తప్ప ఈ సినిమాలో చూడటానికి ఏమీ లేదు. కథ నుంచి డైరెక్షన్ వరకూ అన్నీ మైనస్ లు గానే చెప్పుకోవాలి. ఈ సినిమా టైటిల్ ‘మల్లిగాడు న్యారేజ్ బ్యూరో’, దానికి ఉపశీర్షిక ‘వన్ ఇయర్ మాత్రమె గ్యారంటీ’. ఈ సినిమాకి ప్రేక్షకులు థియేటర్స్ లో ఒక వారం అన్నా గ్యారంటీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు